Breaking News

National Watermelon Day: ప్రయోజనాలే కాదు.. చరిత్ర కూడా గొప్పదే..

Published on Tue, 09/03/2024 - 09:46

జాతీయ పుచ్చకాయ(వాటర్‌ మిలన్‌) దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఆగస్టు 3న జరుపుకుంటారు. పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది. శరీరం హైడ్రేటెడ్‌గా ఉండటానికి పుచ్చకాయ ఎంతో ఉపయోగపడుతుంది. ఈ పంట సాగు 2000 బీసీ నుండి కొనసాగుతోంది. 

పుచ్చకాయ చరిత్ర
పుచ్చకాయ మొదటి పంటను సుమారు 5,000 సంవత్సరాల క్రితం ఈజిప్టులో పండిచారని చరిత్ర చెబుతోంది. 12వ ఈజిప్షియన్ రాజవంశీయులు తిరుగాడిన ప్రదేశాలలో పుచ్చకాయ, దాని గింజల జాడలను కనుగొన్నారు.  కింగ్ టుటన్‌ఖామెన్ సమాధిలోనూ పుచ్చకాయ ఆనవాళ్లు కనిపించాయి. పురాతన ఈజిప్షియన్ శాసనాలలో వివిధ రకాల పుచ్చకాయల పెయింటింగ్‌లు కనిపించాయి.

ఆఫ్రికాలోని కలహరి ఎడారిలో ప్రయాణించే వ్యాపారులకు పుచ్చకాయ విత్తనాలను విక్రయించినట్లు తెలుస్తోంది. పుచ్చకాయ సాగు ఆఫ్రికా అంతటా చేశారని తెలుస్తోంది. ఆ తర్వాత ఇది మధ్యధరా దేశాలకు, ఐరోపాలోని ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. తొమ్మిదవ శతాబ్దం చివరి నాటికి, చైనాతో పాటు మిగిలిన ఆసియా దేశాలలో పుచ్చకాయను విరివిగా సాగు చేయడం మొదలుపెట్టారు.

జాన్ మరియాని రాసిన ‘ది డిక్షనరీ ఆఫ్ అమెరికన్ ఫుడ్ అండ్ డ్రింక్’ లోని వివరాల ప్రకారం పుచ్చకాయ అనే పదం 1615లో ఆంగ్ల నిఘంటువులో కనిపించింది. యునైటెడ్ స్టేట్స్‌లో 300కు మించిన రకాల పుచ్చకాయలను పండిస్తున్నారు.

ఆరోగ్య ప్రయోజనాలు
పుచ్చకాయలో 92శాతం మేరకు నీరు ఉంటుంది . కేలరీలు తక్కువ పరిణామంలో ఉంటాయి. ఈ పండు నిర్జలీకరణాన్ని నిరోధించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. బరువు తగ్గాలనుకునేవారు తమ డైట్‌లో ఈ జ్యూసీ ఫ్రూట్‌ని చేర్చుకోవాలి. పుచ్చకాయ గుండె సంబంధిత వ్యాధుల ముప్పును తగ్గిస్తుంది. పుచ్చకాయలో హీట్ స్ట్రోక్‌ను నిరోధించే ఎలక్ట్రోలైట్స్ ఉంటాయి. పుచ్చకాయ జ్యూస్ తాగడం వల్ల శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. 

Videos

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)