Breaking News

Parliament :సస్పెండెడ్‌ ఎంపీలు కోల్పోయేవి ఇవే !

Published on Wed, 12/20/2023 - 09:39

న్యూఢిల్లీ : ప్రస్తుత పార్లమెంట్‌ సెషన్‌లో ఎంపీల సస్పెన్షన్‌ పర్వం కొనసాగుతోంది. ఈ సెషన్‌లో ఇప్పటివరకు లోక్‌సభ, రాజ్యసభల్లో కలిపి విపక్షానికి చెందిన 141 మంది ఎంపీలు సస్పెన్షన్‌కు గురయ్యారు. ఒక్క లోక్‌సభ నుంచే 95 మంది ఎంపీలు సస్పెండ్‌ అయ్యారు. ఇటీవల జరిగిన పార్లమెంట్‌ భద్రతా వైఫల్యం ఘటనపై కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా స్టేట్‌మెంట్‌ ఇవ్వాల్సిందేనన్న డిమాండ్‌తో సభను అడ్డుకున్నందుకు స్పీకర్‌​ ఎంపీలపై వేటు వేశారు.

అయితే సస్పెండ్‌ అయిన ఎంపీలకు సంబంధించి మంగళవారం లోక్‌సభ సెక్రటేరియట్‌ ఒక సర్క్యులర్‌ రిలీజ్‌ చేసింది. ఈ సర్క్యులర్‌ ప్రకారం సస్పెండెడ్‌ ఎంపీలు కేవలం సభలోకి రాకుండా ఉండడమే కాక ఎంపీలుగా తమకు సంక్రమించిన మరెన్నో హక్కులను తాత్కాలికంగా కోల్పోతారు. ఆ ఎంపీలకు సభతో పాటు పార్లమెంట్‌ చాంబర్‌, లాబీ, గ్యాలరీలకు కూడా ప్రవేశం ఉండదు. సాధారణంగా ఎంపీలు వివిధ పార్లమెంటరీ కమిటీల్లో సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ సిట్టింగ్‌లలో కూర్చునే హక్కునూ సస్పెండెడ్‌ ఎంపీలు కోల్పోతారు. 

సస్పెండైన ఎంపీలు ఇచ్చే ఎలాంటి నోటీసులనూ సభలో అనుమతించరు. వారి పేరు మీద  ఏ రకమైన బిజినెస్‌ను లిస్ట్‌ చేయరు. వీటితో పాటు ఆర్థిక పరమైన ప్రభావం కూడా సస్పెండెండ్‌ ఎంపీల మీద ఉంటుంది. సాధారణంగా ఎంపీలకు చెల్లించే రోజు వారి భత్యాలు కూడా సెషన్‌ మొత్తం సస్పెండ్‌ అయిన ఎంపీలకు చెల్లించరని సర్క్యులర్‌లో లోక్‌సభ సెక్రటేరియట్‌ పేర్కొంది.

ఇదీచదవండి..కొరియా లేడీ యూట్యూబర్‌కు వేధింపులు.. వ్యక్తి అరెస్టు

Videos

YS జగన్ విజువల్స్ @గన్నవరం ఎయిర్ పోర్ట్

తాడిపత్రిలో ఎన్నికల టెన్షన్.. YSRCP జాఫర్ ను కిడ్నాప్ చేసిన జేసీ వర్గీయులు

మైదుకూరు నామినేషన్ సెంటర్లో కి వెళ్ళి... దౌర్జన్యం చేసిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్

ZPTC, MPTC స్థానాలకు షెడ్యూల్

ఇక దోమల శకానికి ముగింపు.. ఏఐతో అద్భుత ఆవిష్కరణ

పులివెందులలో ఉద్రిక్తత.. అవినాష్ రెడ్డి సహా వందల మందిపై కేసులు

ప్రతి కార్యకర్త తిరగబడండి.. నిలబడండి.. YSRCP శ్రేణులకు జగన్ పిలుపు

కోలీవుడ్ డైరెక్టర్స్ వైపే చూస్తున్న టాలీవుడ్ టాప్ హీరోస్

ఆళ్లగడ్డలో ఉద్రిక్తత.. ఇద్దరు ప్రపోజర్లు కిడ్నాప్

దీపావళి తర్వాత మూతపడనున్న పెట్రోల్ బంకులు? కారణం ఇదుకే..!

Photos

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)