Breaking News

Voter Registration: మిగిలింది 3 రోజులే.. ఇదే లాస్ట్‌ ఛాన్స్‌!

Published on Fri, 04/12/2024 - 18:16

న్యూఢిల్లీ: రానున్న పార్లమెంట్‌ ఎన్నికల్లో ప్రతీ ఒక్కరూ ఓటు వినియోగించుకునేలా ఎన్నికల సంఘం చర్యలు చేపడుతోంది. ఇప్పటివరకు ఓటు లేని అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తోంది. ఓటరు నమోదు చేసుకునేందుకు ఏప్రిల్‌ 15 చివరి గడువుగా నిర్ణయించింది. అర్హులు ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు మరో మూడు రోజులే అవకాశం ఉంది. సార్వత్రిక ఎన్నికల్లో ఓటు వేయడానికి, కొత్తగా ఓటును పొందడానికి ఇదే చివరి అవకాశం.

అప్లయ్‌ చేసుకోండిలా..
ఈ నెల 1వ తేదీ నాటికి 18 ఏళ్ల నిండిన యువతీయువకులు(2006 మార్చి 31వ తేదీలోపు జన్మించిన వారు) ఫారం–6 ద్వారా దరఖాస్తు చేసుకోవాలని సూచిస్తోంది. ఇందుకు ఆధార్‌కార్డు, పుట్టిన తేదీ ధ్రువీకరించేలా ఎస్సెస్సీ మార్కుల మెమో జత చేయాలని అధికారులు చెబుతున్నారు.

దరఖాస్తులను నేరుగా ఆయా బీఎల్వోలు (బూత్‌ లెవల్‌ అధికారులు) లేదా సంబంధిత తహసీల్దార్‌ కార్యాలయాల్లో అందజేయాలని సూచిస్తున్నారు. ఓటర్స్‌ హెల్ప్‌లైన్‌, ఎన్‌వీఎస్‌వీ పోర్టల్‌లో ఆన్‌లైన్‌ ద్వారా కూడా ఓటు కోసం దరఖాస్తు చేసుకునే అవకాశముంది. అయితే ప్రజలు దరఖాస్తు చేసుకునే సమయంలో అప్లికేషన్‌ రిజెక్ట్‌ కాకుండా నిర్ణీత ప్రూఫ్‌లు తప్పక జతచేయాల్సి ఉంటుంది

నిర్ణీత గడువులోపు అందిన దరఖాస్తులను అధికారులు పరిశీలిస్తారు. నిబంధనల ప్రకారం ఉంటే వారిని ఓటర్లుగా గుర్తిస్తారు. ఈ నెల 25వ తేదీన ప్రకటించే ఓటరు అనుబంధ జాబితాలో వారి పేర్లు చేర్చుతారు. ఈ జాబితాలో పేర్లు కలిగిన కొత్త ఓటర్లతో పాటు సాధారణ ఓటర్లు మే 13వ తేదీన జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో ఓటు వినియోగించుకోవచ్చని అధికారులు చెబుతున్నారు.
చదవండి: ఓటులో  ఎన్ని రకాలు ఉంటాయో తెలుసా?

ఇప్పటికే ఓటరు జాబితాలో పేరుండి నివాసం వారి ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతానికి మార్చుకోవడానికి, కుటుంబ సభ్యులందరివీ ఒకే పోలింగ్‌ కేంద్రంలో లేకపోతే మార్చు చేసుకోవడానికి కూడా అవకాశం ఉంది. ఇలాంటి వారందరూ ఫారం-8 ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)