Breaking News

జులానాలో విజేత.. వినేశ్‌ ఫొగాట్‌!

Published on Wed, 10/09/2024 - 07:52

సాక్షి, న్యూఢిల్లీ: ఒలింపిక్స్‌లో పతకం సాధించలేకపోయినా హరియాణా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించి సత్తా చాటారు రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌(30). జులానా అసెంబ్లీ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ తరఫున పోటీకి దిగిన ఫొగాట్‌ దాదాపు 19 ఏళ్ల అనంతరం ఆ పార్టీకి విజయాన్ని సాధించి పెట్టారు. రెజ్లింగ్‌లో విజయం సాధించలేకపోయిన ఫొగాట్‌ను జులానా ఓటర్లు ఆదరించారు. ఫొగాట్‌కు 65,080 ఓట్లు రాగా బీజేపీ అభ్యర్థి యోగేష్‌ కుమార్‌కు 59,065 ఓట్లు పడ్డాయి.

 ఓట్ల లెక్కింపులో తొలి రౌండ్‌ నుంచి ఆధిక్యాన్ని ప్రదర్శించిన ఫొగాట్‌ మధ్యలో కాస్త వెనుకబడ్డారు. చివరకు 6,015 ఓట్ల తేడాతో గెలుపు తీరాలకు చేరారు. అసెంబ్లీలో తొలిసారి అడుగుపెట్టే అవకాశం దక్కించుకున్నారు. కాగా, 2019 ఎన్నికల్లో ఇక్కడ కేవలం 12,440 ఓట్లు సాధించిన కాంగ్రెస్‌ పార్టీ ఈసారి ఒలింపియన్‌ వినేశ్‌ ఫొగాట్‌ను బరిలోకి దింపి జాట్‌ ఓట్లను కొల్లగొట్టే ప్రయత్నం చేసి, సఫలమైంది. మరోవైపు, బీజేపీ యోగేష్‌ కుమార్‌ను నిలిపి ఓబీసీ ఓట్లను ఆకర్షించేందుకు ప్రయతి్నంచి, విఫలమైంది.  

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)