Breaking News

విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతం..

Published on Sat, 07/18/2026 - 11:39

శ్రీహరికోట: స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరోస్పేస్‌ సంస్థ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి ప్రైవేట్ ఆర్బిటాల్‌ రాకెట్‌ విక్రమ్‌-1 ప్రయోగం విజయవంతమైంది. దీంతో, ఇస్రో యువ శాస్త్రవేత్తలు సంబరాలు చేసుకున్నారు. ఇది దేశంలోనే తొలి ప్రైవేటు ఆర్బిటల్‌ రాకెట్‌గా రికార్డుల్లోకి ఎక్కింది. హైదరాబాద్‌ కేంద్రంగా పనిచేస్తున్న స్కైరూట్‌ ఏరోస్పేస్‌ అభివృద్ధి చేసిన విక్రమ్‌-1ను శ్రీహరికోటలోని సతీశ్‌ ధావన్‌ స్పేస్‌ సెంటర్‌ నుంచి ప్రయోగించారు. 

చిన్న ఉపగ్రహాలను భూ కక్ష్యలోకి ప్రవేశపెట్టే సామర్థ్యంతో ఈ రాకెట్‌ను రూపొందించారు. విక్రమ్‌-1లో ఆధునిక సాంకేతికతను వినియోగించారు. తేలికైన కార్బన్‌ కాంపోజిట్‌ నిర్మాణం, అధునాతన ప్రొపల్షన్‌ వ్యవస్థలు ఈ రాకెట్‌ ప్రత్యేకతలుగా ఉన్నాయి. చిన్న ఉపగ్రహాల ప్రయోగాలను తక్కువ ఖర్చుతో, వేగంగా నిర్వహించాలన్న లక్ష్యంతో ఈ ప్రాజెక్టును అభివృద్ధి చేశారు.

విక్రమ్‌-1 ప్రధాన లక్ష్యం..
350 కిలోల వరకు ఉపగ్రహాలను మోసుకెళ్లే సామర్థ్యం ఉంది. 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్‌ ఆర్బిట్‌లోకి 350 కిలోల వరకు పేలోడ్లను ప్రవేశపెట్టడం. 60 డిగ్రీల వంపు (Inclination) ఉన్న కక్ష్యలో ఉపగ్రహాలను అమర్చేలా ఈ మిషన్‌ను రూపొందించారు. ఇది చిన్న ఉపగ్రహ ప్రయోగాల మార్కెట్‌లో భారత్‌కు కొత్త అవకాశాలను తెరవనుంది.

విక్రమ్-1 ప్రత్యేకతలు
తయారీ సంస్థ: స్కైరూట్ ఏరోస్పేస్, హైదరాబాద్
రాకెట్ రకం: ఆర్బిటల్-క్లాస్ లాంచ్ వెహికల్
పొడవు: సుమారు 24 మీటర్లు
బరువు: సుమారు 30 టన్నులు

దశలు (Stages): 
మూడు ఘన ఇంధన (Solid Fuel) దశలు + 1 లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్
పేలోడ్ సామర్థ్యం: గరిష్ఠంగా 350 కిలోల వరకు
కక్ష్య: 450 కిలోమీటర్ల ఎత్తులోని లో ఎర్త్ ఆర్బిట్ (LEO)
కక్ష్య వంపు (Inclination): 60 డిగ్రీలు
విక్రమ్-1లో ఉపయోగించిన సాంకేతికత
కార్బన్ కాంపోజిట్‌తో తేలికైన నిర్మాణం
3D ప్రింటింగ్ సాంకేతికతతో తయారైన కొన్ని కీలక భాగాలు
ఘన ఇంధన రాకెట్ మోటార్లు
చివరి దశలో కక్ష్యను ఖచ్చితంగా సరిచేసే లిక్విడ్ ఆర్బిటల్ అడ్జస్ట్‌మెంట్ మాడ్యూల్

 

 

అంతకుముందు.. చివరి నిమిషంలో సాంకేతిక సమస్య కారణంగా ప్రయోగం ఆలస్యమైంది. ఇంధన ప్రక్రియలో సాంకేతిక సమస్యను గుర్తించడంతో ప్రయోగాన్ని నిలిపివేసినట్టు ఇస్రో పేర్కొంది. గుర్తించారు. శాస్త్రవేత్తలు పరిస్థితిని చక్కదిద్దారు. దీంతో 35 నిమిషాలు ఆలస్యంగా ప్రయోగం ప్రారంభమైంది. 

 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)