Breaking News

ఎన్‌సీడబ్ల్యూ చైర్‌పర్సన్‌గా విజయా కిశోర్‌

Published on Sun, 10/20/2024 - 05:07

సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ మహిళా కమిషన్‌(ఎన్‌సీడబ్ల్యూ) నూతన చైర్‌పర్సన్‌గా విజయ కిశోర్‌ రహాట్కర్‌ నియమితులయ్యారు. అదేవిధంగా, కమిషన్‌ సభ్యురాలిగా డాక్టర్‌ అర్చనా మజుందార్‌ నియమితులయ్యారు. కేంద్ర ప్రభుత్వం శనివారం ఈ మేరకు గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. రహాట్కర్‌ మూడేళ్ల పాటు, లేదా 65 ఏళ్లు వచ్చే వరకు పదవిలో కొనసాగుతారని తెలిపింది. మజుందార్‌ మూడేళ్ల పాటు కొనసాగుతారని వివరించింది. 

తక్షణం ఈ నియామకాలు అమల్లోకి వస్తాయని స్పష్టం చేసింది. మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌కు చెందిన రహాట్కర్‌ 1995లో బీజేపీలో చేరారు. 2007–2010 మధ్య ఛత్రపతి సంభాజీనగర్‌ (ఔరంగాబాద్‌) మున్సిపల్‌ కార్పొరేషన్‌ మేయర్‌గా ఉన్నారు. నేషనల్‌ మేయర్స్‌ కౌన్సిల్‌కు ఉపాధ్యక్షురాలిగా వ్యవహరించారు. బీజేపీ మహిళా మోర్చా జాతీయ కార్యదర్శిగా 2010–2014 మధ్య పనిచేశారు. 2016–21 సంవత్సరాల్లో మహారాష్ట్ర మహిళా కమిషన్‌కు చైర్‌పర్సన్‌గా ఉన్నారు.

Videos

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)