Breaking News

తొక్కిసలాట తర్వాత ప్రజల ముందుకు విజయ్

Published on Sat, 11/22/2025 - 21:07

టీవీకే అధినేత సినీ నటుడు విజయ్ రేపు  తమిళనాడు కాంచీపురం జిల్లాలో బహిరంగ సభ నిర్వహించనున్నారు.  ఓ ప్రైవేట్ కాలేజ్ కు చెందిన గ్రౌండ్ లో కేవలం రెండు వేల మంది పార్టీ ప్రతినిధులతో సభ నిర్వహించనున్నట్లు సమాచారం. సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం తర్వాత విజయ్ ప్రజల్లోకి రావడం ఇదే తొలిసారి.

సినీహీరో విజయ్ కి తమిళనాట ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  సినిమాల్లో ఎంతో ఫాలోయింగ్  ఉన్న ఈ స్టార్ హీరో  రాజకీయంగా సైతం తమిళనాట తన సత్తా చూపించాలని తమిళిగ వెట్రి కజగం ( టీవీకే) పార్టీ స్థాపించారు. తన మార్కుకు అనుగుణంగానే లక్షల మందితో బహిరంగ సభలు నిర్వహించి అందరి దృష్టిని ఆకర్షించిన విజయ్ ని  సెప్టెంబర్ 27న కరూర్ లో జరిగిన ర్యాలీలో జరిగిన ప్రమాదం అపఖ్యాతి పాలు చేసింది. ఇరుకైన ప్రదేశంలో  ర్యాలీ నిర్వహించడంతో  తొక్కిసలాట జరిగి 41 మంది ప్రజలు చనిపోయారు. ఈ ఘటన తమిళనాడునే కాకుండా యావద్దేశాన్ని కలిచివేసింది.

ఈ నేపథ్యంలో తమిళ స్టార్ విజయ్ మరోసారి ప్రజల ముందుకు రానున్నారు. కాంచిపురం జిల్లాలో రెండు వేల మంది పార్టీ కార్యకర్తలతో సమావేశం నిర్వహించనున్నారు. దీనికి పటిష్ఠ భద్రత ఏర్పాటు చేస్తున్నారు. ఈ మీటింగ్ భద్రతకు సంబంధించి  ఇదివరకే పార్టీకి కార్యకర్తలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నారు. అంతేకాకుండా లోపలికి వెళ్లే వ‍్యక్తులకు క్యూఆర్ కోడ్ ఉన్న ప్రత్యేక పాస్ లు మంజూరు చేయనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.    

ఈ మీటింగ్ లో విజయ్ పలు అంశాలపై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేయనున్నట్లు తెలుస్తోంది. కాగా డిసెంబర్ 4న ర్యాలీ అనుమతి కోసం టీవీకే ప్రయత్నించగా భద్రతా కారణాల రీత్యా పోలీసులు అనుమతి నిరాకరించారు. దీంతో టీవీకే పార్టీ ఈ మీటింగ్ నిర్వహించనున్నట్లు సమాచారం

తమిళనాడులో ఎన్నికలు వచ్చే ఏడాది జరగనున్నాయి. ఈ నేపథ్యంలో టీవీకే ప్రచార కార్యక్రమాలను వేగవంతం చేయాలని చూస్తోంది. ర్యాలీలకు, భారీ సభలకు పోలీసుల అనుమతికి సమయం పడుతున్న నేపథ్యంలో వీలైనన్ని ఇండోర్ మీటింగ్ లు నిర్వహించి ప్రజలకు చేరువ కావాలని టీవీకే భావిస్తున్నట్లు తెలుస్తోంది.

 

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)