Breaking News

వక్ఫ్ బోర్డును రద్దు చేయాలంటూ ర్యాలీ

Published on Sun, 09/29/2024 - 09:17

హమీర్‌పూర్‌: హిమాచల్‌ ప్రదేశ్‌లోని సంజౌలీలో అక్రమంగా నిర్మిస్తున్న మసీదును కూల్చివేయాలని కోరుతూ దేవభూమి సంఘర్ష్ సమితి హమీర్‌పూర్‌లో నిరసన ర్యాలీ చేపట్టింది. దీనిలో పాల్గొన్న 46 ఏళ్ల విశ్వహిందూ పరిషత్ (వీహెచ్‌పీ) సభ్యుడొకరు గుండెపోటుతో కన్నుమూశారు. వక్ఫ్ బోర్డును రద్దు చేయాలని  నిరసనకారులు డిమాండ్‌ చేస్తున్నారు.  

దేవభూమి సంఘర్ష్ సమితి పిలుపు మేరకు సిమ్లా, హమీర్‌పూర్, మండీ, చంబా, నహాన్‌ జిల్లాల్లో పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు జరిగాయి. హమీర్‌పూర్‌లో ఆందోళనకారులు అధికారులకు మెమోరాండం సమర్పించడానికి వెళ్తుండగా, వీహెచ్‌పీ కార్యకర్త వరిందర్ పర్మార్ స్పృహతప్పి పడిపోయాడు. అతన్ని వెంటనే పోలీసు వాహనంలో హమీర్‌పూర్ మెడికల్ కాలేజీకి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు అతను మృతిచెందాడని తెలిపారు.

నిరసన ప్రదర్శనలో పాల్గొన్న దేవభూమి సంఘర్ష్ సమితి కమిటీ కో-కన్వీనర్ మదన్ ఠాకూర్ మాట్లాడుతూ, వివాదాస్పద మసీదుపై అక్టోబర్ ఐదు వరకూ కోర్టు నిర్ణయం కోసం వేచి చూస్తామని, ఆ తరువాత భవిష్యత్ వ్యూహాన్ని నిర్ణయించుకుంటామ‍న్నారు. అక్టోబర్ ఐదు తర్వాత జైల్ భరో ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. తమపై ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారని,  ప్రజల మనోభావాలను రెచ్చగొట్టిన ఏఐఎంఐఎం నేత షోయబ్ జమైపై ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆయన ఆరోపించారు.

ఇది కూడా చదవండి: రోడ్డు ప్రమాదం.. తొమ్మిదిమంది మృతి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)