Breaking News

ఏప్రిల్‌ 19 నుంచి కట్రా- శ్రీనగర్‌ ‘వందేభారత్‌’

Published on Mon, 03/31/2025 - 12:59

శ్రీనగర్‌: అందాల కశ్మీర్‌(Kashmir) ఇప్పుడు దేశంలోని ఇతర ప్రాంతాలతో రైలు మార్గం ద్వారా అనుసంధానం కానుంది. ప్రధాని నరేంద్ర మోదీ ఏప్రిల్ 19న కట్రా నుండి శ్రీనగర్‌కు నడిచే తొలి వందే భారత్ రైలును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని తెలియజేసిన కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ‘కశ్మీర్‌ వందేభారత్ రైలు‌ ప్రారంభమయ్యే చారిత్రాత్మక క్షణం కశ్మీర్‌కు కొత్త అధ్యాయం అవుతుందని’ అన్నారు.

272 కిలోమీటర్ల పొడవైన ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్వే లింక్ ప్రాజెక్ట్ పూర్తికావడంతో కశ్మీర్‌కు కొత్త రైలు మార్గం ఏర్పడింది. ఈ ప్రాజెక్ట్ గత నెలలోనే పూర్తయింది.  అలాగే కట్రా-బారాముల్లా మార్గంలో రైలు రాకపోకల ట్రయల్స్‌ విజయవంతంగా పూర్తయ్యాయి. ఈ ఏడాది జనవరిలో కట్రా- కశ్మీర్ మధ్య రైలు సర్వీసుకు రైల్వే భద్రతా కమిషనర్ ఆమోదం తెలిపారు.

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం వందే భారత్ ఎక్స్‌ప్రెస్(Vande Bharat Express) ప్రారంభంతో జమ్ము.. శ్రీనగర్ మధ్య ప్రయాణ సమయం గణనీయంగా తగ్గనుంది. అలాగే ప్రయాణీకులకు వేగవంతమైన, సౌకర్యవంతమైన ప్రయాణం అందుబాటులోకి రానుంది. కశ్మీర్‌కు నేరుగా రైలు సర్వీసు ఏర్పాటు చేయాలనే డిమాండ్ చాలా కాలంగా ఉంది. నూతన వందేభారత్‌ రైలు సర్వీసుతో అది నెరవేరనుంది.

‍కశ్మీర్‌లో పరుగులు తీయబోయే వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఇతర రైళ్లకు భిన్నంగా ఉండనుంది. దీనిని మైనస్‌ -20 డిగ్రీల సెల్సియస్ కంటే తక్కువ ఉష్ణోగ్రతలో కూడా సజావుగా నడిచేలా తీర్చిదిద్దారు. ఈ మార్గంలో నిరంతరాయంగా రైలు సేవలను కొనసాగించేందుకు, పట్టాలపై ఉన్న మంచును తొలగించేందుకు ముందుగా ప్రత్యేక మంచు క్లియరెన్స్ రైళ్లను నడుపుతారు. ఫలితంగా ఈ రైల్వే లైన్ ఏడాది పొడవునా అందుబాటులో ఉంటుంది.

ఇది కూడా చదవండి: ఈద్ వేళ సీఎం మమత సంచలన ఆరోపణలు

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)