Breaking News

Vande Bharat: ఆటోమెటిక్‌ తలుపులు.. ఆధునిక టాయ్‌లెట్లు

Published on Wed, 09/11/2024 - 08:48

సాక్షి, హైదరాబాద్‌: పరిమిత దూరంలో ఉన్న నగరాల మధ్య 160 కి.మీ. గరిష్ట వేగంతో దూసుకుపోతున్న వందేభారత్‌ రైళ్లు.. ఇక వెయ్యి కి.మీ.ని మించిన దూరప్రాంతాల మధ్య తిరిగేందుకు సిద్ధమయ్యాయి. ఇందుకుగాను తొలిసారి స్లీపర్‌ బెర్తులతో కూడిన వందేభారత్‌ రైలు పూర్తిస్థాయిలో సిద్ధమై త్వరలో తొలి పరుగుకు సిద్ధమైంది. ఇప్పటివరకు మన రైళ్లలో కనిపించని ఆధునిక రూపుతో ఇవి కళ్లు చెమర్చేలా ఉండటం ప్రత్యేక ఆకర్షణగా మారింది. రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌ ఇటీవల ఈ రైలును పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. దీనికి ఆమోదముద్ర పడటంతో మరిన్ని రైళ్ల తయారీ కూడా ఊపందుకుంది. పూర్తిస్థాయిలో అగ్ని నిరోధక భద్రతా ప్రమాణాలతో రూపొందిన ఈ రైలు పూర్తిస్థాయి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందడం విశేషం. 



ప్రత్యేకతలు ఇవే.. 
👉స్లీపర్‌ వందేభారత్‌ రైలును ఆస్టెనిటిక్‌ స్టెయిన్‌లెస్‌ స్టీలుతో రూపొందించారు. వందేభారత్‌ తరహాలో దీని వెలుపలి రూపు ఏరోడైనమిక్‌ డిజైన్‌తో కనువిందు చేస్తోంది. 
👉 ఇంటీరియర్‌ను జీఎప్‌ఆర్‌పీ ప్యానెల్‌తో రూపొందించారు. ఇందులో మాడ్యులర్‌ పాంట్రీ ఉంటుంది.  
👉 అగ్ని నిరోధక వ్యవస్థలో ఈఎన్‌–45545 ప్రమాణ స్థాయితో రూపొందింది. 
👉 దివ్యాంగులు కూడా సులభంగా వినియోగించగలిగే పద్ధతిలో ప్రత్యేక బెర్తులు, టాయిలెట్లను ఇందులో పొందుపరిచారు.  
👉 ఆటోమేటిక్‌ పద్ధతిలో తెరుచుకొని మూసుకునే పద్ధతిగల తలుపులను ఏర్పాటు చేశారు. ఇది సెన్సార్‌ ఆధారిత ఇంటర్‌ కమ్యూనికేషన్‌తో పనిచేస్తాయి. 
👉 దుర్వాసనను నియంత్రించే ప్రత్యేక వ్యవస్థతో కూడిన పూర్తి సౌకర్యవంతమైన టాయ్‌లెట్లను అందుబాటులోకి  తీసుకొచ్చారు. 
👉 లోకోపైలట్ల కోసం ప్రత్యేక టాయిలెట్లను ఏర్పాటు చేశారు. 
👉 మొదటి శ్రేణి ఏసీ కోచ్‌లో వేడి నీటితో కూడిన షవర్‌ వ్యవస్థ అందుబాటులో ఉంటుంది. 
👉 కోచ్‌లలోని బెర్తుల వద్ద రీడింగ్‌ లైట్లు, యూఎస్‌బీ చార్జింగ్‌ వసతి ఉంటుంది.  
👉 అనౌన్స్‌మెంట్‌ల కోసం ఆడియో, వీడియో వ్యవస్థ ఉంటుంది.  
👉 ప్రయాణికుల లగేజీ భద్రపరిచేందుకు విశాలమైన కోచ్‌           ఉంటుంది. 
👉 సెక్యూరిటీ, రైల్వే సిబ్బందికి ప్రత్యేక గదిని ఏర్పాటు చేశారు. లోకోపైలట్‌తో నేరుగా మాట్లాడేందుకు ప్రత్యేక ఆడియో వ్యవస్థ అక్కడ అందుబాటులో ఉంటుంది.  



మొత్తం 16 కోచ్‌లు.... 
ఈ ఆధునిక స్లీపర్‌ వందేభారత్‌ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. అందులో ఏసీ 3–టైర్‌ కోచ్‌లు 11 ఉంటాయి. వాటిల్లో 611 బెర్తులు అందుబాటులో ఉంటాయి. ఏసీ 2 టైర్‌ కోచ్‌లు 4 ఉంటాయి. వీటిల్లో 188 బెర్తులు ఉంటాయి. ఫస్ట్‌ క్లాస్‌ ఏసీ కోచ్‌ ఒకటి ఉంటుంది. అందులో 24 బెర్తులుంటాయి. అప్పర్‌ బెర్తులోకి చేరుకునేందుకు ప్రత్యేక నిచ్చెన తరహా ఏర్పాటు ఉంటుంది. మిడిల్‌ బెర్తు నారింజ రంగులో, లోయర్, అప్పర్‌ బెర్తులు గ్రే కలర్‌లో ఉంటాయి. అప్పర్‌ బెర్డులను నిలిపి ఉంచేందుకు గతంలో గొలుసు తరహా ఏర్పాటు ఉంటే, ఇందులో ప్రత్యేక స్టీల్‌ స్ట్రిప్‌ ఏర్పాటు చేశారు. బెర్తుల వద్ద మేగజైన్‌ బ్యాగు, మొబైల్‌ ఫోన్‌ పెట్టుకునే బాక్సు ఏర్పాటు చేశారు. æ బెర్తులు ఆరడుగుల పొడవుతో ఏర్పాటు చేశారు.  

 

Videos

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

Photos

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)