Breaking News

‘వందే భారత్‌’లో విండో ఓపెన్‌ అవుతుందని..

Published on Mon, 06/23/2025 - 09:41

న్యూఢిల్లీ: ఎంతో సౌకర్యవంతమైన ‍ప్రయాణాన్ని అందించే ‘వందేభారత్‌’లో ప్రయాణించాలని పలువురు భావిస్తుంటారు. అయితే ఈ రైలు అధునాతనమైనది కావడంతో కొందరు ప్రయాణికులు గందరగోళానికి గురవుతుంటారు. ఇటువంటి ఉదంతమే ఇప్పుడు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తనకు ఎదురైన అనుభవాన్ని @AiSenpaiyt అనే  రెడిట్‌ యూజర్‌  'r/IndianRailways' ఫోరమ్‌లో వివరించారు. ఈ పోస్టును చూసినవారంతా రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో తాను కూర్చున్న విండో సీటును అడిగేందుకు ఒక మహిళ అనారోగ్యాన్ని సాకుగా చూపిందని, దానిని తాను ఎలా  తిరస్కరించాననేది ఆయన ఆ పోస్టులో తెలిపారు. ఆ రెడిట్ యూజర్ తాను రిజర్వు చేసుకున్న విండో సీటులో  హాయిగా కూర్చున్నారు.

రెండు స్టాప్‌ల తరువాత 40 ఏళ్ల  ఒక మహిళ అతని పక్క సీటులో కూర్చుంది.  రెండు పెద్ద బ్యాగులు కూడా ఆమె దగ్గరున్నాయి. ఆమె మర్యాదపూర్వకంగా నవ్వుతూ పలుకరించింది. కిటికీలోంచి బయటకు చూసేందుకు కొద్దిగా ముందుకు వంగింది. తరువాత ఈ సీటు తనకు కావాలని, కడుపులో వికారంగా ఉందని తెలిపింది. అయితే అతను క్షమాపణలు కోరుతూ, ఆ సీటు ఇచ్చేది లేదని తేల్చిచెప్పారు. దీంతో చేసేదేమీ లేక ఆమె తనకు కేటాయించిన సీటులోనే కూలబడింది. వందేభారత్‌ రైలులో విండో సీటు తెరుచుకోదని తెలియని ఆమె ఇలా ప్రవర్తించి ఉంటుందని ఆ  రెడిట్ యూజర్ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: అణు కేంద్రంలో ఆరు రంధ్రాలు.. ఉపగ్రహ చిత్రాల్లో వెల్లడి

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)