Breaking News

Uttar Pradesh: నేడు వందేభారత్‌ రైలులో ఉచిత ప్రయాణం

Published on Sat, 08/31/2024 - 06:55

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని మీరట్-లక్నోల మధ్య నేటి నుంచి వందేభారత్‌ రైలు పరుగులు తీయనుంది. మీరట్-లక్నో-మీరట్(22490/22491) వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ఛార్జీలు, రాకపోకల జాబితాను రైల్వేశాఖ విడుదల చేసింది.

ఈరోజు (శనివారం) ఈ రైలు తొలిసారిగా పట్టాలు ఎక్కనుంది. నేడు అతిథి ప్రయాణికులకు రైల్వేశాఖ మీరట్-లక్నోల మధ్య ఉచితంగా ప్రయాణించే అవకాశాన్ని కల్పించింది. లక్నో-మీరట్(22491), మీరట్-లక్నో(22490) వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ల రెగ్యులర్ ఆపరేషన్ ఆదివారం నుండి ప్రారంభంకానుంది. శుక్రవారం ఐఆర్‌సీటీసీ వెబ్‌సైట్‌లో ఈ రైలు అప్‌డేట్ అయిన తర్వాత టికెట్ బుకింగ్ ప్రారంభమైంది. మీరట్-లక్నో వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను ప్రధాని మోదీ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జెండా ఊపి ప్రారంభించనున్నారు.

బరేలీ జంక్షన్‌లో ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ రైలు మీరట్-లక్నో మధ్య మొరాదాబాద్, బరేలీ జంక్షన్‌లలో మాత్రమే ఆగుతుంది. ఈ రైలుకు సంబంధించిన బుకింగ్ ప్రారంభమైన నేపధ్యంలో సెప్టెంబర్ 5 తర్వాత తేదీల ప్రయాణం కోసం సీట్లు వేగంగా బుక్ అవుతున్నాయి. ప్రస్తుతం బరేలీ జంక్షన్‌లో రైలుకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.  

మీరట్-లక్నో వందే భారత్ మీరట్ నుండి ఉదయం 6:35 గంటలకు బయలుదేరి, 8:35 గంటలకు మొరాదాబాద్, 9:56 గంటలకు బరేలీ చేరుకుని మధ్యాహ్నం 1:45 గంటలకు లక్నో చేరుకుంటుంది. అలాగే లక్నో-మీరట్ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ లక్నో నుండి మధ్యాహ్నం 2:45 గంటలకు బయలుదేరి సాయంత్రం 6:02 గంటలకు బరేలీకి చేరుకుంటుంది. ఇక్కడి నుంచి రాత్రి 7:32 గంటలకు మొరాదాబాద్, రాత్రి 10 గంటలకు మీరట్ చేరుకుంటుంది.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)