Breaking News

భీమ్‌ ఆర్మీ చీఫ్‌ ప్రయాణిస్తున్న వందే భారత్‌పై రాళ్ల దాడి

Published on Mon, 11/04/2024 - 06:13

లక్నో: భీమ్‌ ఆర్మీ పార్టీ చీఫ్‌ చంద్ర శేఖర్‌ ఆజాద్‌ ప్రయాణిస్తున్న వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌పై అల్లరి మూకలు రాళ్ల దాడికి పాల్పడ్డాయి. ఈ ఘటనలో రైలు కిటికీ ధ్వంసమైంది. ఉత్తరప్రదేశ్‌లోని బులంద్‌షహర్‌ జిల్లా కమల్‌పూర్‌లో ఆదివారం చోటుచేసుకున్న ఘటనలో ఆజాద్‌కు ఎటువంటి హాని జరగలేదు. ఢిల్లీ నుంచి కాన్పూర్‌ వస్తుండగా ఉదయం 7.12 గంటల సమయంలో జరిగిన ఈ ఘటనతో షాక్‌కు గురయ్యాయనని అనంతరం ఆజాద్‌ ఎక్స్‌లో పేర్కొన్నారు. ‘నా కంటే రెండు సీట్లు ముందు కూర్చున్న ప్రయాణికుడి దగ్గర ఉన్న అద్దాలు పగిలిపోయాయి. 

ఈ సంఘటనతో నేను షాక్‌కి గురయ్యాను. ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించడమే కాదు, ప్రయాణికుల భద్రతకు సైతం ముప్పు కలిగించే పరిణామమిది. ఇటువంటి ఘటనలకు పాల్పడే వారిని వదిలిపెట్టకూడదు’అని ఆయన పేర్కొన్నారు. ఘటన నేపథ్యంలో భద్రత కోసం సి–3 నుంచి సి–14 బోగీకి మారినట్లు చెప్పారు. దీనిపై రైల్వే భద్రతాధికారులకు సమాచారమివ్వగా వారు వచ్చి పరిశీలించారని, సి–3 బోగీపై మాత్రమే రాళ్ల దాడి జరిగినట్లు గుర్తించారని ఆజాద్‌ చెప్పారు. ‘ఒక్క 2022 లోనే రైళ్లపై రాళ్లు రువి్వన ఘటనలు 1,503 నమోదైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటితో రైల్వే శాఖకు కోట్లాది రూపాయల మేర నష్టం వాటిల్లింది. పదేపదే జరుగుతున్న ఈ ఘటనలు ప్రయాణికుల ప్రాణాలకు సైతం ప్రమాదకరంగా మారాయి’అని ఆజాద్‌ తెలిపారు.

Videos

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు