Valmiki Jayanti: రేపు విద్యాసంస్థలకు సెలవు.. ఈ రాష్ట్రాల్లోనే..

Published on Mon, 10/06/2025 - 13:25

న్యూఢిల్లీ: మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 7వ తేదీ (మంగళవారం)న దేశంలోని పలు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు, ప్రభుత్వ కార్యాలయాలకు సెలవు ప్రకటించారు. వాల్మీకి జయంతి నాడు ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా, గ్రేటర్ నోయిడా, ఘజియాబాద్‌లతో సహా రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు మూసివేయనున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఢిల్లీ ప్రభుత్వం కూడా మహర్షి వాల్మీకి జయంతిని ప్రభుత్వ సెలవు దినంగా ప్రకటించింది. అక్టోబర్ 7వ తేదీన అన్ని పాఠశాలలు, కళాశాలలు, ప్రభుత్వ కార్యాలయాలు మూసివేయనున్నట్లు ప్రకటించింది.

ఢిల్లీ ప్రభుత్వం తెలిపిన వివరాల ప్రకారం మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా రాజధాని అంతటా పలు కార్యక్రమాలు, ఊరేగింపులు, నివాళి సమావేశాలు నిర్వహించనున్నారు. వీటిలో ముఖ్యమంత్రి రేఖా గుప్తా పాల్గొననున్నారు. రామాయణాన్ని రచించిన మహర్షి వాల్మీకి జయంతిని పురస్కరించుకుని ఉత్తరప్రదేశ్‌లోని అన్ని పాఠశాలలు, కళాశాలలు, బ్యాంకులు,  ప్రభుత్వ కార్యాలయాలు అక్టోబర్ 7న మూసివేయనున్నామని ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్ అంతటా పలు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. అక్టోబర్ 7న రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో రామాయణ పారాయణం జరుగుతుందని సీఎం తెలిపారు.

ప్రతీ ఏటా  ఆశ్వయుజ మాసంలోని పౌర్ణమినాడు మహర్షి వాల్మీకి జయంతిని జరుపుకుంటారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని దేవాలయాల్లో ప్రత్యేక పూజలు, ఊరేగింపులు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తారు. పురాణాల ప్రకారం మహర్షి వాల్మీకి మహర్షి కశ్యపుడు, అదితి దంపతుల తొమ్మిదవ కుమారుడు. మహర్షి వాల్మీకికి ఆ పేరు ఎలా వచ్చిందనే దాని వెనుక ఒక పురాణగాథ ఉంది. వాల్మీకి తీవ్రమైన ధ్యానంలో మునిగిపోయినప్పుడు, చెదపురుగులు అతని శరీరం చుట్టూ చేరి, పుట్టలను కట్టాయి. సంస్కృతంలో చెదపురుగుల పుట్టలను వాల్మీకి అని పిలుస్తారు. అందుకే నాటి నుంచి ఆ మహర్షి పేరు వాల్మీకి అయ్యింది. రామాయణ గాథ ప్రకారం శ్రీరాముడు.. సీతామాతను విడిచిపెట్టిన తర్వాత, ఆమె మహర్షి వాల్మీకి ఆశ్రమంలో ఆశ్రయం పొందింది. శ్రీరాముని కుమారులైన లవ కుశులకు విద్యను అందించిన ఘనత కూడా వాల్మీకికే దక్కుతుంది.
 

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)