Breaking News

హోటళ్ల వ్యాక్సినేషన్​ ప్యాకేజీలు.. కేంద్రం కన్నెర

Published on Sun, 05/30/2021 - 13:06

కరోనా టైంలో విలాసవంతమైన హోటల్స్​ ఐసోలేషన్​ సెంటర్లుగా మారిపోయాయి. ఈమధ్య అయితే ఏకంగా వ్యాక్సిన్​ డోసులూ అందిస్తున్నాయి. వ్యాక్సినేషన్​ పేరిట స్పెషల్​ ప్యాకేజీలు కూడా ఆఫర్ చేస్తున్నాయి. హైదరాబాద్​ సహా దేశంలోని ప్రముఖ నగరాలు, పట్టణాల్లో ప్రైవేట్ ఆస్పత్రులతో చేతులు కలిపి లగ్జరీ హోటల్స్​ ఈ దందాను నడిపిస్తున్నాయి. అయితే ఈ చర్యలపై కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ కన్నెర చేసింది.

న్యూఢిల్లీ:  ప్రైవేట్​ ఆస్పత్రులు, హోటల్స్​తో కలిసి నడిపిస్తున్న వ్యాక్సినేషన్​ దందాలను సహించబోమని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది. ఇది నిబంధనలకు విరుద్ధమని, చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పేర్కొంటూ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ అదనపు కార్యదర్శి మనోహర్‌, వ్యాక్సినేషన్​ గైడ్​లెన్స్​​ కూడిన లేఖల్ని శనివారం పంపించారు.

ఈమధ్య కొవిడ్​ వ్యాక్సినేషన్​ ప్యాకేజీల పేరుతో లగ్జరీ హోటల్స్​ యాడ్స్ ఇచ్చుకుంటున్నాయి. ఫలానా రోజులకి, ఫలానా రేటంటూ ప్రకటించుకుంటున్నాయి. ఫుడ్​, బెడ్​, వైఫైలతో పాటు పేరుమోసిన పెద్ద ఆస్పత్రుల నుంచి సిబ్బందిని తెప్పించి కస్టమర్లకు వ్యాక్సిన్​ డోసులు అందిస్తున్నాయి. ఈ ప్రకటనలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి కూడా. ఈ తరుణంలోనే కేంద్రం స్పందించింది. స్టార్‌ హోటళ్లలో టీకాలు వేయడం రూల్స్​ విరుద్ధమని, తక్షణం కార్యక్రమాన్ని నిలిపివేసేలా చూడాలని, అవసరమైన క్రిమినల్ చర్యలు తీసుకోవాలని రాష్ట్రాలకు ఆ మార్గదర్శకాల్లో ఆరోగ్యశాఖ కార్యదర్శి గట్టిగానే సూచించారు. కాగా, ఒకవైపు వ్యాక్సిన్​ కొరత కొనసాగుతున్న వేళ.. ప్రైవేట్ ఆస్పత్రులకు వ్యాక్సిన్​ డోసులు అందించడంపై కొన్ని రాష్ట్రాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఈ తరుణంలో తాజా ఆదేశాలు కొంచెం ఊరట ఇచ్చే అంశమే. ఇప్పటిదాకా మన దేశంలో 21 కోట్ల డోసుల వ్యాక్సిన్​ పంపిణీ జరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. 

ఎక్కడెక్కడంటే..
ప్రభుత్వ, ప్రైవేట్ కోవిడ్​ వ్యాక్సినేషన్​ సెంటర్లు, వర్క్​ ప్లేసులు, వయసు మళ్లినవాళ్ల కోసం హోం కోవిడ్​ వ్యాక్సినేషన్​ సెంటర్లు, గ్రూప్​ హౌజింగ్ సొసైటీల దగ్గర వైకల్యం ఉన్నవాళ్లకు, ​ఆర్​డబ్ల్యూఏ ఆఫీసుల్లో, కమ్యూనిటీ సెంటర్​లలో, పంచాయితీ భవన్​లలో, విద్యా సంస్థల్లో, ఓల్డ్​ ఏజ్​ హోమ్స్​లో టెంపరరీ బేస్​ మీద వ్యాక్సిన్​ అందించాలని కేంద్రం గైడ్​లైన్స్​ రిలీజ్ చేసింది. ఈ మేరకు వ్యాక్సినేషన్​ డ్రైవ్​ను నిశితంగా పరిశీలించాలని, అవకతవకలు జరిగితే కేసులు నమోదు చేయాలని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు ఆరోగ్య శాఖ సూచించింది.

Videos

కవిత లెటర్ పై KTR షాకింగ్ రియాక్షన్

ఈనాడు పత్రికపై వైఎస్ జగన్ వ్యాఖ్యలు వైరల్

కవిత లేఖ కల్లోలం.. కేటీఆర్ సంచలన ప్రెస్ మీట్

YSR జిల్లాలో విషాదం

వంశీ ఆరోగ్య పరిస్థితిపై కుటుంబ సభ్యుల ఆందోళన

YSRCP హరికృష్ణ ను చంపడానికి ప్రయత్నం

నా భర్తను కాపాడండి.. హరికృష్ణ భార్య ఎమోషనల్

విజనరీ ముసుగులో చంద్రబాబు స్కాముల చిట్టా.. పక్కా ఆధారాలతో..

ట్రంప్ సర్కారుకు షాక్

లిక్కర్ స్కామ్ డైరెక్టర్.. బాబుకు టెన్షన్ పెట్టిస్తున్న ఈనాడు ప్రకటన..

Photos

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : సరస్వతి నది పుష్కరాలకు..పోటెత్తిన భక్తులు (ఫొటోలు)

+5

శిల్పకళా వేదిక : మిస్ వరల్డ్ టాలెంట్ గ్రాండ్ ఫినాలే..అందాల భామల సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘థగ్‌ లైఫ్‌’ చిత్రం మీడియా మీట్‌ (ఫొటోలు)

+5

విజయవాడ : వైభవంగా హనుమాన్ జయంతి శోభాయాత్ర (ఫొటోలు)