Breaking News

Uttarkashi tunnel collapse: సొరంగం పనులకు మళ్లీ ఆటంకం

Published on Sat, 11/25/2023 - 05:59

ఉత్తరకాశీ: ఉత్తరాఖండ్‌లోని సిల్‌ క్యారా సొరంగంలో 12 రోజులుగా చిక్కుకుపోయిన కార్మికులను రక్షించే పనులకు శుక్రవారం మళ్లీ అవరోధం ఏర్పడింది. గురువారం సాంకేతిక సమస్యల కారణంగా నిలిచిపోయిన డ్రిల్లింగ్‌ను 25 టన్నుల భారీ ఆగర్‌ యంత్రంతో శుక్రవారం తిరిగి ప్రారంభించారు. అయితే, కొద్దిసేపటికే మరోసారి సమస్యలు రావడంతో నిలిపివేశారు.

వాటిని సరిచేసి మళ్లీ పనులు ప్రారంభించినా గంటలోనే మళ్లీ అంతరాయం ఏర్పడిందని అధికారులు తెలిపారు. కూలిన శిథిలాల గుండా సొరంగంలోకి ఒకదానికొకటి వెల్డింగ్‌తో కలిపిన స్టీలు పైపులను పంపించి, వాటిగుండా కార్మికులను వెలుపలికి తీసుకు వచ్చేందుకు అధికారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు.

రెండు రోజులుగా ఏర్పడుతున్న అంతరాయాలు టన్నెల్‌ వద్ద ఆత్రుతగా ఎదురుచూస్తున్న కార్మికుల సంబంధీకుల్లో ఆందోళన రేపుతోంది. అయితే, మిగిలి ఉన్న 5.4 మీటర్ల మేర శిథిలాల్లో డ్రిల్లింగ్‌కు అవరోధాలు ఎదురుకాకపోవచ్చని ప్రత్యేక రాడార్‌ ద్వారా తెలిసిందని అధికారులు తెలిపారు. ఇలా ఉండగా, టన్నెల్‌ నుంచి వెలుపలికి వచ్చాక కార్మికులకు వైద్య పరీక్షలు చేసి, ఆ వెంటనే గ్రీన్‌ కారిడార్‌ ద్వారా ఆస్పత్రులకు తరలించేందుకు ఏర్పాట్లు చేసినట్లు గఢ్‌వాల్‌ రేంజ్‌ ఐజీ కేఎస్‌ నంగ్యాల్‌ చెప్పారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)