Breaking News

కాళీనది ఉగ్రరూపం.. ఉత్తరాఖండ్‌ అతలాకుతలం

Published on Sat, 07/13/2024 - 06:59

దేశంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. దీంతో పలు వాగులు, వంకలు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. లెక్కలేనన్ని ప్రాంతాలు నీట మునిగాయి. జనజీవనం అస్తవ్యస్తంగా మారింది.

ఉత్తరాఖండ్‌లోకి ‍ప్రవేశించిన రుతుపవనాలు  ఉగ్రరూపాన్ని దాల్చాయి. రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. నదులన్నీ ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. గడ్డివాములు నదుల్లోకి చేరుతున్నాయి. రోడ్లపై చేరిన చెత్తాచెదారం రహదారులను మూసేస్తోంది. భారత్-నేపాల్ సరిహద్దులోని ధార్చులలో గల కాళీనది ఉగ్రరూపాన్ని దాల్చింది. దీంతో సమీప ప్రాంతాల్లోని ప్రజలంతా అప్రమత్తం కావాలని స్థానిక యంత్రాంగం విజ్ఞప్తి చేసింది.

ఎన్‌డిఆర్‌ఎఫ్ బృందం కాళీనది పరిసర ప్రాంతాలను నిరంతరం పర్యవేక్షిస్తోంది. కాళీనదిలోని నీటి మట్టం అంతకంతకూ పెరుగుతోంది. భారీ వర్షాల కారణంగా పలుచోట్ల రహదారులు కొట్టుకుపోయాయి. కాళీనది ఉగ్ర రూపానికి సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతకంతకు నదిలో పెరుగున్న నీటి మట్టాన్ని ఈ వీడియోలలో గమనించవచ్చు. రాష్ట్రంలో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలుచోట్ల కొండచరియలు విరిగిపడుతున్నాయి. వంతెనలు కూలిపోవడంతో పాటు పలు రహదారులు మూసుకుపోయాయి. రాష్ట్రంలోని ప్రజలు అనేక ఇబ్బందులను  ఎదుర్కొంటున్నారు.
 

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)