Breaking News

ఉత్తరాఖండ్‌లో అమల్లోకి  ఉమ్మడి పౌరస్మృతి

Published on Tue, 01/28/2025 - 04:44

డెహ్రాడూన్‌: మతాలకతీతంగా మహిళలకు నిజమైన సాధికారతే లక్ష్యంగా, పౌరులందరికీ సమాన హక్కులు, బాధ్యతలు దఖలుపరిచే లక్ష్యంతో తీసుకొచ్చిన ఉమ్మడి పౌరస్మృతి చట్టం(యూసీసీ) ఉత్తరాఖండ్‌లో సోమవారం అమల్లోకి వచ్చింది. దీంతో దేశంలో యూసీసీని అమలుచేసిన తొలి రాష్ట్రంగా ఉత్తరాఖండ్‌ రికార్టులకెక్కింది. అన్ని మతాల్లో లింగభేదం లేకుండా పౌరులందరికీ ఉమ్మడి చట్టం అమలుచేయడమే యూసీసీ ముఖ్యోద్దేశం.

 చట్టం అమలుతో రాష్ట్రవ్యాప్తంగా అన్ని మతాల వారికి ఒకే తరహా వివాహ, విడాకుల, ఆస్తుల చట్టాలు అమలవుతాయి. ఇస్లామ్‌ను ఆచరించే వారికి ఇకపై విడిగా ముస్లిం పర్సనల్‌ లా బోర్డ్‌ లాంటివి చెల్లుబాటుకావు. ముస్లిం మహిళలకు ట్రిపుల్‌ తలాక్‌ అంటూ ఏకపక్షంగా ఇచ్చే విడాకులు చెల్లవు. షెడ్యూల్‌ తెగలను మాత్రం యూసీసీ నుంచి మినహాయించారు. 

వాళ్ల గిరిజన సంప్రదాయాలు, కట్టుబాట్లను ప్రభుత్వం గుర్తించి విలువ ఇస్తుంది. సోమవారం యూసీసీ రాష్ట్రంలో అమల్లోకి వచ్చిందని డెహ్రాడూన్‌లోని అధికార నివాసంలో ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ ప్రకటించారు. కేబినెట్‌ మంత్రులు, నాటి యూసీసీ ముసాయిదా కమిటీ సభ్యుల సమక్షంలో ఆయన యూసీసీ పోర్టల్‌ను ప్రారంభించారు. 

వివాహాలు చేసుకున్నా, విడాకులు తీసుకున్నా, సహజీవనం చేసినా ప్రతీదీ ఈ పోర్టల్‌ ద్వారా ఖచ్చితంగా ఆన్‌లైన్‌లో రిజిస్ట్రేషన్‌ కోసం నమోదుచేసుకోవాల్సిందే. పెళ్లికాకుండా సహజీవనం కారణంగా పుట్టిన పిల్లలకూ వారసత్వ హక్కులు దక్కేలా యూసీసీ చట్టంలో మార్పులుచేసి అమల్లోకి తెచ్చారు. పోర్టల్‌ ద్వారా ముఖ్యమంత్రి ధామీ తన వివాహాన్ని రిజిస్టర్‌ చేసుకున్నారు. 

పోర్టల్‌ ద్వారా జారీ అయిన తొలి డాక్యుమెంట్‌ను రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాధా సీఎం ధామీకి అందజేశారు. ‘‘ మతాలకతీతంగా పౌరులందరికీ యూసీసీ ద్వారా సమాన హక్కులు, బాధ్యతలు ఉంటాయి. మూడేళ్ల క్రితం యూసీసీపై మాటిచ్చా. ఇన్నాళ్లకు ఇది సాకారమైంది. ఈ ఘనత రాష్ట్ర ప్రజలదే. విభిన్న ఆచార వ్యవహారాలు, జీవనం సాగించే ఎస్టీలను యూసీసీ పరిధిలోకి తెచ్చి వారిని ఇబ్బంది పెట్టొద్దని నిర్ణయించుకున్నాం.

 అందుకే వారిని యూసీసీ నుంచి మినహాయించాం’’ అని సీఎం స్పష్టంచేశారు. చట్టం ప్రకారం ఇకపై ఉత్తరాఖండ్‌లో అన్ని మతాలకు చెందిన స్త్రీ, పురుషులకు కనీస వివాహ వయస్సు ఒకేలా ఉంటుంది. అన్ని మతాల్లో బహుభార్యత్వం విధానాన్ని నిషేధించారు. హలాల్‌ విధానాన్ని సైతం రద్దుచేశారు. ‘‘ యూసీసీ అమలుతో భారత రాజ్యాంగ చరిత్రలో మరో సువర్ణాధ్యాయాన్ని లిఖించాం’’ అని సీఎం అన్నారు.  
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)