ఉత్తరాఖండ్‌లో కూలిన హెలికాప్టర్‌.. ఏడుగురు మృతి

Published on Sun, 06/15/2025 - 08:09

డెహ్రాడూన్‌: అహ్మాదాబాద్‌లో జరిగిన విమాన ప్రమాదం నుంచి కోలుకోకముందే.. మరో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఉత్తరాఖండ్‌లో ఘోర హెలికాప్టర్‌ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ కూలిపోవడంతో అందులో ప్రయాణిస్తున్న ఏడుగురు మృతిచెందారు. సదరు హెలికాప్టర్‌ డెహ్రాడూన్‌ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తున్న సమయంలో ప్రమాదం జరిగింది.

వివరాల ప్రకారం.. ఉత్తరాఖండ్‌లో ఆదివారం ఉదయం హెలికాప్టర్‌ కూలిపోయింది. ఆర్యన్‌ ఏవియేషన్‌కు చెందిన హెలికాప్టర్‌ ఆదివారం తెల్లవారుజామున 5:20 గంటలకు గుప్తకాశీ నుంచి కేదార్‌నాథ్‌ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. హెలికాప్టర్‌ గౌరీకుండ్‌ అటవీ ప్రాంతంలో కూలిపోయింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో హెలికాప్టర్‌లో ఏడుగురు ఉండగా.. పైలట్‌తో సహా అందరూ మృతిచెందారు. అయితే, ప్రతికూల వాతావరణం కారణంగా ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఎన్‌డీఆర్‌ఎఫ్‌, ఎస్‌డీఆర్‌ఎఫ్‌ బృందాలు.. సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. వీరంతా ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌, మహారాష్ట్ర, గుజరాత్‌కు చెందిన వారిగా గుర్తించారు. 

మృతుల వివరాలు..
రాజ్‌వీర్‌- పైలట్‌. 
విక్రమ్‌ రావత్‌,
వినోద్‌, 
త్రిష్టి సింగ్‌, 
రాజ్‌కుమార్‌, 
శ్రద్దా, 
రాశి(10)..  
 

 

మరోవైపు.. హెలికాప్టర్‌ ప్రమాదంపై ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి స్పందించారు. ఆయన ట్విట్టర్‌ వేదికగా..‘రుద్రప్రయాగ జిల్లాలో హెలికాప్టర్ ప్రమాదం గురించి తెలిసింది. ఇది చాలా విచారకరం. SDRF, స్థానిక పరిపాలన, ఇతర రెస్క్యూ బృందాలు సహాయక చర్యల్లో పాల్గొన్నాయి. ప్రయాణికులందరి భద్రత కోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను’ అంటూ చెప్పుకొచ్చారు. 

 

 

Videos

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)