ఒకటిన బద్రీనాథ్‌, కేదార్‌నాథ్‌లో దీపావళి వేడుకలు

Published on Wed, 10/30/2024 - 12:52

డెహ్రాడూన్: దీపాల పండుగ దీపావళిని దేశవ్యాప్తంగా అక్టోబర్ 31న జరుపుకోనుండగా, ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్, కేదార్‌నాథ్‌లలో నవంబర్  ఒకటిన జరుపుకుంటున్నారు. తాజాగా దీపావళి పండుగను నవంబర్ 1న జరుపుకోవాలని బద్రీనాథ్-కేదార్‌నాథ్ ఆలయ కమిటీ ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ మేరకు ఉత్తరాఖండ్‌ అంతటా నవంబర్ ఒకటిన దీపావళి వేడుకలు జరుపుకోనున్నారు. బద్రీనాథ్ ధామ్‌కు చెందిన పండితుడు రాధా కృష్ణ తప్లియాల్ తెలిపిన వివరాల ప్రకారం ఈసారి అమావాస్య రెండు రోజుల పాటు వచ్చింది. ప్రదోష కాలం తరువాత కూడా అమావాస్య ఉంటుంది. అందుకే నవంబర్ ఒకటిన మహాలక్ష్మి పూజ చేయాల్సి ఉంటుంది. దీపావళి పండుగను కూడా అదే రోజు చేసుకోవాల్సి ఉంటుంది.

నిజానికి ఉత్తరాఖండ్ ప్రభుత్వం ముందుగా నవంబర్ 1న దీపావళి సెలవు ప్రకటించింది. అయితే తరువాత దానిని సవరించి అక్టోబర్ 31న సెలవు ప్రకటించింది. తిరిగి ఇప్పుడు దీపావళి అధికారిక సెలవుదినం నవంబర్ ఒకటిగా పేర్కొంది. బద్రీనాథ్, కేదార్‌నాథ్ ఆలయాల్లో నవంబర్‌ ఒకటిన దీపావళి వేడుకలు జరగనున్నాయి. దేశవ్యాప్తంగా వెలువడిన 250 పంచాంగాలలో 180 పంచాంగాలలో  నవంబర్ ఒకటిన దీపావళిని జరుపుకోవాలని తెలియజేశాయని, అందుకే ఉత్తరాఖండ్‌లో నవంబర్ ఒకటిన దీపావళి జరుపుకుంటున్నట్లు రాష్ట్రానికి చెందిన జ్యోతిష్య నిపుణులు తెలిపారు.

ఇది కూడా చదవండి: వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌లో దీపావళి వెలుగులు

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)