Breaking News

బద్రీనాథ్‌: భారీగా విరిగిపడ్డ మంచుచరియలు.. చిక్కుకున్న కార్మికులు

Published on Fri, 02/28/2025 - 14:05

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో (Uttarakhand) హిమపాతం భారీ బీభత్సం సృష్టిస్తోంది.  గత కొన్ని రోజులుగా భారీగా మంచుకురుస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం చమోలి-బద్రినాథ్‌ (Badrinath) జాతీయ రహదారిపై భారీ కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో మంచులో ((Avalanche) 57మంది రోడ్డు నిర్మాణ కార్మికులు కూరుకుపోయారు.

మంచు చరియలు విరిగిపడడంతో అప్రమత్తమైన సహాయకబృందాలు 10 మంది కార్మికులను రక్షించాయి. సమాచారమందుకున్న పోలీసులు, బోర్డర్‌ రోడ్స్‌ ఆర్గనైజేషన్‌ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.  మిగిలిన కార్మికుల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశాయి. ఈ గాలింపు చర్యల్లో ఎస్‌డీఆర్‌ఎఫ్‌,ఎన్‌డీఆర్‌ఎఫ్‌ రెస్క్యూ బృందాలు రంగంలోకి దిగాయి.

  

మంచు చరియలు కింద రోడ్డు నిర్మాణ కార్మికులు చిక్కుకున్నట్లు ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి ఎక్స్‌ వేదికగా ధృవీకరించారు. మంచు చరియల కింద చిక్కుకున్న కార్మికులు సురక్షితంగా బయట పడాలని ప్రార్థించారు.

చమోలి జిల్లా మనా గ్రామ సమీపంలో బోర్డర్‌ రోడ్డు ఆర్గనైజేషన్‌ (బ్రో) చేపడుతున్న నిర్మాణ పనులలో చాలా మంది కార్మికులు మంచు చరియల కింద చిక్కుకున్నారనే విచారకరమైన సమాచారం అందింది. నిర్మాణ కార్మికులను రక్షించేందుకు ఐటీబీపీ, బ్రో రెస్క్యూ బృందాలతో పాటు ఇతర రెస్క్యూ టీమ్‌లు  సహాయక చర్యలను నిర్వహిస్తున్నాయి. కార్మికులందరూ సురక్షితంగా ఉండాలని నేను ఆ దేవుణ్ని ప్రార్థిస్తున్నట్లు ట్వీట్‌లో పేర్కొన్నారు.    

Badrinath:  మంచు తుపానులో చిక్కుకుపోయిన 57 మంది వర్కర్లు

Videos

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

Photos

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి