Breaking News

Uttar Pradesh: సమోసా కోసం అల్లుడిని చావగొట్టిన అత్త.. కేసు నమోదు

Published on Thu, 09/04/2025 - 12:23

సెహ్రాపూర్: భార్యాభర్తల మధ్య తలెత్తే వివాదాలు ఒక్కోసారి రోడ్డున పడి అందరి నోళ్లలో నానుతుంటాయి.  ఇలాంటి భార్యభర్తల వివాదాల్లో ఇంటి పెద్దలు తలదూర్చినప్పుడు అవి హద్దులు దాటుతుంటాయి. చిన్నపాటి వివాదాలు కూడా విపరీత పరిణామాలకు దారితీస్తుంటాయి. తాజాగా యూపీలో ఇటువంటి ఉదంతమే చోటుచేసుకుని పోలీస్‌ స్టేషన్‌కు చేరింది. తమ కుమార్తె సమోసాలు అడిగితే తీసుకురానందుకు అల్లునిపై అత్త దాడి చేసింది.

ఈ ఘటన సెహ్రాపూర్‌లో నార్త్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. బాధితుని తల్లి  ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సెహ్రాపూర్‌కు చెందిన సంగీత తన భర్తను సమోసాలు తీసుకురావాలని అడిగింది. అందుకు అతను నిరాకరించడంతో భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది

ఈ విషయాన్ని సంగీత తన పుట్టింటివారికి తెలిపింది. వెంటనే సంగీత ఇంటికి చేరుకున్న ఆమె తల్లి.. అల్లునితో మా అమ్మాయి సమోసాలు తీసుకురమ్మంటే.. ఎందుకు తీసుకురాలేదంటూ నిలదీస్తూ దాడి చేసింది. తరువాత అతని భార్య కూడా దాడికి దిగింది. స్థానికులు బాధిత భర్తను ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని పోలీసు అధికారి ప్రతీక్ దహియా మీడియాకు తెలిపారు.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)