Breaking News

యూపీఎస్సీ సివిల్స్‌ మెయిన్స్‌ ఫలితాలు విడుదల

Published on Mon, 12/09/2024 - 20:00

న్యూఢిల్లీ: అఖిల భారత సర్వీసుల్లో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన సివిల్‌ సర్వీసెస్‌ మెయిన్స్‌ పరీక్ష ఫలితాలను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సోమవారం విడుదల చేసింది. మెయిన్స్‌ పరీక్ష రాసిన అభ్యర్థులు యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్ upsc.gov.in ద్వారా తమ ఫలితాలను చూసుకోవచ్చని తెలిపింది. ఈ మేరకు ఇంటర్వ్యూకు అర్హత సాధించిన అభ్యర్థుల హాల్‌టికెట్‌ నంబర్లతో జాబితాను విడుదల చేసింది. 

కాగా ఈ ఏడాది మొత్తం 1056 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు యూపీఎస్సీ గతంలో నోటిఫికేషన్‌ ఇచ్చిన విషయం తెలిసిందే. జూన్‌ 16న ప్రిలిమ్స్‌ పరీక్ష నిర్వహించి జులై 1న ఫలితాలు వెల్లడించారు. ప్రిలిమ్స్‌లో అర్హత సాధించిన వారికి సెప్టెంబర్‌ 20 నుంచి 29 వరకు మెయిన్‌ పరీక్షలు నిర్వహించారు. 

ఈ ఫలితాలను యూపీఎస్సీ తాజాగా విడుదల చేసింది.  త్వరలో  న్యూ ఢిల్లీలోని షాజహాన్ రోడ్‌లోని ధోల్‌పూర్ హౌస్‌లో ఉన్న యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కార్యాలయంలో ఇంటర్వ్యూలు జరగనున్నాయి. ఈ ఇంటర్వ్యూలో  ఎంపికైన వారిని ఐఏఎస్‌, ఐఎఫ్‌ఎస్‌, ఐపీఎస్‌, ఇతర కేంద్ర సర్వీసులకు ఎంపిక చేస్తారు.

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)