Breaking News

రెండు హైవే ప్రాజెక్టులకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం

Published on Wed, 12/31/2025 - 15:49

ఢిల్లీ: కేంద్ర క్యాబినెట్‌ (Union Cabinet) ఇవాళ( బుధవారం, డిసెంబర్‌ 31) పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. రూ. 20, 668 కోట్ల రూపాయలతో రెండు హైవేల నిర్మాణానికి కేబినెట్‌ ఆమోదం తెలిపింది. నాసిక్ సోలాపూర్ హై స్పీడ్ కారిడార్ నిర్మాణానికి మంత్రివర్గం ఆమోద ముద్ర వేసింది. 19,142 కోట్ల రూపాయలతో 374 కిలోమీటర్ల సూరత్  చెన్నై హై స్పీడ్ కారిడార్ నిర్మాణం జరగనుంది. చెన్నై సూరత్ హై కారిడా నిర్మాణంతో  45 శాతం ప్రయాణ సమయం తగ్గనుంది. 31 గంటల నుంచి 17 గంటల్లో గమ్యస్థానానికి  చేరుకునే అవకాశం ఉంది.

చెన్నై సూరత్ కారిడార్ నిర్మాణంలో భాగంగా కర్నూల్ కడప  మీదుగా జాతీయ రహదారి వెళ్లనుంది. చెన్నై పోర్టు, హజీరా పోర్టుకు కనెక్టివిటీ పెరుగనుంది. కొప్పర్తి, ఓర్వకల్ పారిశ్రామిక ఇండస్ట్రియల్ కారిడార్లకు  హై స్పీడ్ నెట్‌వర్క్‌ ఉపయోగపడనుంది. రెండేళ్లలో రోడ్డు నిర్మాణం పూర్తికానుంది.

ఒడిశాలోని జాతీయ రహదారి 326 వెడల్పు, బలోపేతం కోసం రూ.1526 కోట్ల కేటాయింపునకు కేబినెట్ ఆమోదం తెలిపింది. కాగా, 2024 జూన్ నుంచి రైల్వే, హైవే, మెట్రో, వివిధ మౌలిక వసతుల  ప్రాజెక్టులకు భారీ ఎత్తున నిధులను కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. 12.6 లక్షల రూపాయల నిధులను  కేబినెట్‌ కేటాయించింది. 43 రైల్వే ప్రాజెక్టుల కోసం 1,52,583 కోట్ల రూపాయలను కేటాయించింది. 24 జాతీయ రహదారుల నిర్మాణానికి 2, 18,312 కోట్ల రూపాయలు కేటాయించింది.

8 మెట్రో రైల్ ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.1,31,542 కోట్లు, నాలుగు ఏర్పాట్లు నిర్మాణానికి 7339 కోట్లు, మేజర్ పోర్టు నిర్మాణానికి రూ.1,45,945 కోట్లు, రెండు కొత్త రోప్ వేల నిర్మాణానికి రూ.6811 కోట్లు, మూడు హైడ్రో ప్రాజెక్టుల నిర్మాణానికి రూ.28,432 కోట్లు, 12 పారిశ్రామిక స్మార్ట్ సిటీస్ ఏర్పాటుకు రూ.28, 602 కోట్లు, పీఎం ఆవాస్ యోజన కోసం 5,36,137 కోట్లను కేంద్రం కేటాయించింది.

వొడాఫోన్‌-ఐడియాకు ఉపశమనం
కేంద్ర కేబినెట్‌ మరో కీలక నిర్ణయం తీసుకుంది. వొడాఫోన్‌-ఐడియాకు ఉపశమనం కల్పించింది. రూ.87,695 కోట్ల ఏజీఆర్‌ బకాయిలు ఫ్రీజ్‌కు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది.

Videos

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

Photos

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)