Breaking News

జాతీయ న్యాయ విధానం తీసుకురావాలి 

Published on Thu, 11/27/2025 - 05:36

న్యూఢిల్లీ: అంచనా వేయలేని తీర్పుల సంఖ్యను, తీర్పుల్లో భిన్నత్వాన్ని తగ్గించడానికి ఏకీకృత జాతీయ న్యాయ విధానం తీసుకురావాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ సూర్యకాంత్‌ చెప్పారు. న్యాయస్థానాలు కచి్చతత్వంతో, స్థిరత్వంతో తీర్పులివ్వడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం సుప్రీంకోర్టు బార్‌ అసోసియేషన్‌(ఎస్సీబీఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలో జస్టిస్‌ సూర్యకాంత్‌ పాల్గొన్నారు. న్యాయ వ్యవస్థలో బార్, ధర్మాసనాల ప్రాధాన్యతను వివరించారు. కోర్టులను రాజ్యాంగానికి రక్షకులుగా భావిస్తే.. దీపం పట్టుకొని వారి మార్గాన్ని ప్రకాశవంతం చేసేవారే బార్‌ సభ్యులు అని వ్యాఖ్యానించారు. 

న్యాయమూర్తులు విధులు నిర్వర్తించడానికి బార్‌ సభ్యులు ఎంతగానో సహకరిస్తున్నారని ప్రశంసించారు. మరోవైపు సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవంలోనూ జస్టిస్‌ సూర్యకాంత్‌ ప్రసంగించారు. ఏకీకృత జాతీయ న్యాయ విధానం గురించి లేవనెత్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్‌రామ్‌ మేఘ్వాల్, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్‌ విక్రమ్‌నాథ్, అటార్నీ జనరల్‌ ఆర్‌.వెంకటరమణి తదితరులు పాల్గొన్నారు. అలాగే భూటాన్, కెన్యా, మారిషస్, శ్రీలంక, నేపాల్, మలేíసియా సుప్రీంకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు, న్యాయమూర్తులు సైతం హాజరు కావడం విశేషం. 
 

Videos

విద్యా శాఖ కమిషనర్ Vs ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి

ఫస్ట్ డేనే ఇంట్లో రణరంగం.. నాయకుడి కోసం పెద్ద గొడవ! రెచ్చిపోయిన రోహిత్..

రామానందనాకు బెయిల్ వస్తుందా..?

రవితేజ రేంజికి తగ్గట్టే రెమ్యునరేషన్ పారితోషికంలో మాత్రం తగ్గేదేలే!

Viral: కదులుతున్న రైలు ఎక్కబోయి.. చివరికి ఏం జరిగిందంటే?

GOLD: నిన్న, మొన్న తగ్గినదానికంటే ఇవాళ ఒక్కరోజులోనే..

Bowenpally: పొట్టు.. పొట్టు కొట్టుకున్న బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు

టెట్ అర్హత లేని టీచర్లను నియమించొద్దు సుప్రీంకోర్టు సంచలన ఆదేశాలు

జబర్దస్త్ నరేష్ జీవితంలో ఎన్నో మలుపులు.. వెనుక అసలు కథ..!

నాకు ఏం సంబంధం లేదు కన్నీళ్లు పెట్టుకున్న శ్యామ్ ఇన్స్టిట్యూట్ డైరెక్టర్

Photos

+5

దువాతో రణ్‌వీర్‌ సింగ్‌, దీపికా పదుకొణె.. వైరల్‌గా ఫ్యామిలీ (ఫొటోలు)

+5

అందాల ఆషిక.. చీరలో ఆకట్టుకుందిలా..(ఫొటోలు)

+5

అబు జాని 40 సంవత్సరాల ఈవెంట్‌...మెరిసిన ప్రముఖులు (ఫొటోలు)

+5

‘ఎపిక్ ’మూవీ.. హీరోయిన్ వైష్ణవి చైతన్య (ఫొటోలు)

+5

'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో మెరిసిన.. మాళవిక మోహనన్ (ఫొటోలు)

+5

నల్ల చీరలో మైమరిపించే అందంతో ప్రియా ప్రకాష్ వారియర్..(ఫొటోలు)

+5

చిన్న వయసులోనే సంచలనాలు.. కెప్టెన్‌గా ఎదిగిన గిల్ అరుదైన (ఫొటోలు)

+5

కార్తి 'సర్దార్ 2'ప్రీ రిలీజ్ ఈవెంట్..(ఫొటోలు)

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)