Breaking News

Udhampur: కాల్పుల కలకలం.. జవాను మృతి.. నలుగురు ఉగ్రవాదుల కోసం వేట

Published on Sat, 09/20/2025 - 10:05

ఉధంపూర్: జమ్ముకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లాలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు గాయపడ్డాడు. ప్రస్తుతం భారత్‌ జరుపుతున్న ఎదురుకాల్పుల్లో జైషే-ఎ-మొహమ్మద్‌కు చెందిన నలుగురు ఉగ్రవాదులు చిక్కుకున్నారు. తొలుత కిష్త్వార్‌లో కాల్పులు జరిగాయని తెలిపిన ఆర్మీ తరువాత ఆపరేషన్ ఉధంపూర్‌కే పరిమితమయ్యిందని పేర్కొంది.

‘ఎక్స్‌’ పోస్ట్‌లో వైట్ నైట్ కార్ప్స్.. దోడా-ఉధంపూర్ సరిహద్దుల్లో కాల్పులు జరుగుతున్నాయని తెలిపింది. నిర్దిష్ట సమాచారం మేరకు, ఆర్మీ, స్పెషల్ ఆపరేషన్స్ గ్రూప్ (ఎస్‌ఓజీ),పోలీసులు ఆపరేషన్ ప్రారంభించారు. ఫలితంగా ముష్కరుల నుంచి కాల్పులు జరిగాయి.ఈ కాల్పుల్లో ఒక ఆర్మీ జవాన్ గాయపడ్డాడు. గత ఏడాది కాలంగా ఈ ప్రాంతంలో పలుమార్లు కాల్పులు జరిగాయి. జూన్ 26న డూడు-బసంత్‌గఢ్ అడవిలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో  ఉగ్రవాది హైదర్ హతమయ్యాడు.

ఇతను జైషే మొహమ్మద్‌కు చెందిన టాప్ కమాండర్. గత నాలుగేళ్లుగా ఈ ప్రాంతంలో చురుకుగా పనిచేస్తున్నాడు. ఏప్రిల్ 25న, బసంత్‌గఢ్ ప్రాంతంలో జరిగిన కాల్పుల్లో ఒక ఆర్మీ సైనికుడు వీరమరణం పొందారు. దీనికి ముందు జమ్ముకశ్మీర్ పోలీసుల కౌంటర్-ఇంటెలిజెన్స్ విభాగం కశ్మీర్ లోయలోని  శ్రీనగర్, బారాముల్లా, అనంత్‌నాగ్, కుప్వారా, హంద్వారా, పుల్వామా, షోపియన్‌లలో ఉగ్రవాదుల ఆచూకీ కోసం తనిఖీలు నిర్వహించింది.

Videos

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

Photos

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)