Breaking News

శ్రీనగర్‌ లాల్‌చౌక్‌ కోసం మామ- మేనల్లుడు పోటీ

Published on Tue, 09/24/2024 - 12:15

శ్రీనగర్: జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 90 అసెంబ్లీ స్థానాల్లో శ్రీనగర్‌లోని లాల్ చౌక్ సీటు కీలకమైన సీటుగా పేరొందింది.  సెప్టెంబర్ 25న లాల్ చౌక్ స్థానానికి రెండో దశలో పోలింగ్ జరగనుంది. ఈ సీటు నుంచి ఇతర అభ్యర్థులతో పాటు మామ, మేనల్లుడు కూడా తలపడుతున్నారు.

లాల్ చౌక్ నుంచి అప్నీ పార్టీ సీనియర్ నేత అష్రఫ్ మీర్, పీడీపీ యువ అభ్యర్థి జుహైబ్ యూసుఫ్ మీర్ తలపడుతున్నారు. వీరిద్దరూ వరుసకు మామా- మేనల్లుడు. గతంలో అష్రఫ్ మీర్ పీడీపీ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో సోనావర్ స్థానం నుండి పోటీచేసి, జమ్ముకశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాను ఓడించారు. అయితే 2018లో బీజేపీ, పీడీపీ కూటమి తెగిపోవడంతో అష్రఫ్ మీర్ పీడీపీని వీడి అల్తాఫ్ బుఖారీ సొంత పార్టీ అయిన అప్నీలో చేరారు. కాగా జుహైబ్ బ్రిటన్ నుంచి ఆర్థికశాస్త్రంలో పీజీ పట్టా పొందారు. మెహబూబా ముఫ్తీ అతనికి లాల్ చౌక్ నుండి పోటీ చేసేందుకు టిక్కెట్ ఇచ్చారు. దీంతో లాల్‌ చౌక్‌లో మామ- మేనల్లుడు పోరు ఆసక్తికరంగా మారింది.

మరోవైపు జమ్ము కశ్మీర్ చరిత్రలో  ఏనాడూ ఒక్క సీటు కూడా గెలవని బీజేపీ ఈసారి లాల్ చౌక్ అసెంబ్లీ నియోజకవర్గంలో తన బలాన్ని చాటే ప్రయత్నం చేస్తోంది. బీజేపీ అభ్యర్థి అజాజ్ హుస్సేన్ ఇక్కడి నుంచి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధం అయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా శ్రీనగర్‌లో ర్యాలీ నిర్వహించి, ఇక్కడి ప్రజలను ఆకట్టుకునేందుకు ప్రయత్నించారు. ఆర్టికల్ 370ని రద్దు  చేసిన తర్వాత బీజేపీ ఇక్కడ పలు అభివృద్ధి పనులు చేసిందని మోదీ పేర్కొన్నారు. 

ఇది కూడా చదవండి: జపాన్‌లో భూకంపం.. సునామీ హెచ్చరిక జారీ

Videos

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)