Breaking News

2 కోట్లకుపైగా ఆధార్‌ ఐడీల తొలగింపు 

Published on Thu, 11/27/2025 - 05:31

న్యూఢిల్లీ: ఆధార్‌ కార్డుల దుర్వినియోగాన్ని అరికట్టడంతోపాటు ఆధార్‌ వ్యవస్థను మరింత పారదర్శకంగా మార్చే ఉద్దేశంతో కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. జనాభా లెక్కలు చూసే రిజి్రస్టార్‌ జనరల్‌ ఆఫ్‌ ఇండియా సహా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాంతాలు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, ప్రజా పంపిణీ వ్యవస్థలు, నేషనల్‌ సోషల్‌ అసిస్టెంట్‌ ప్రోగ్రామ్‌ల నుంచి సేకరించిన పౌరుల మరణాల జాబితాతో ఆధార్‌ ఐడీలను సరిపోల్చి మృతుల సంబంధ ఆధార్‌ గుర్తింపు(ఐడీ)లను నిర్వీర్యంచేస్తోంది. ఇలా తాజాగా 2 కోట్లకుపైగా ఐడీల డీయాక్టివేషన్‌ పూర్తయినట్లు కేంద్ర ఎల్రక్టానిక్స్, ఐటీ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో పేర్కొంది.

 ఎప్పటికప్పుడు ప్రక్షాళనతో ఆధార్‌ కార్డుల సంఖ్యలో ప్రభుత్వానికి సైతం ఒక స్పష్టత ఉంటుందని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఆధార్‌ డేటాబేస్‌ సమగ్రతను కాపాడటంతోపాటు ఆధార్‌ ఐడీ నంబర్ల దుర్వినియోగానికి అడ్డుకట్టవేసేందుకే దేశవ్యాప్తంగా ఇలా ఒకేసారి భారీస్థాయిలో ప్రక్షాళన మొదలుపెట్టినట్లు ప్రభుత్వం వెల్లడించింది.

 మరణించిన వారి ఆధార్‌ కార్డ్‌ దుర్వినియోగం కాకూడదని భావించే కుటుంబసభ్యులు సొంతంగా కూడా ‘మైఆధార్‌ పోర్టల్‌’ ద్వారా ఆయా ఐడీల డీయాక్టివేషన్‌ను కోరవచ్చు. మరణాన్ని ధృవీకరించేముందు ఆయా కుటుంబసభ్యులు తమ ఐడీని ధృవీకరించాల్సి ఉంటుంది. ప్రాథమిక వివరాలతోపాటు మరణ ధ్రువీకరణ పత్రాన్ని అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. ఆయా దరఖాస్తుల వివరాలను విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ(యూఐడీఏఐ) సంస్థ అధికారులు పరిశీలిస్తారు. తనిఖీల తర్వాత మృతుల ఆధార్‌ ఐడీలను డీయాక్టివేట్‌ చేస్తారు. 

పునరుద్ధ్దరణ కూడా సాధ్యమే 
జీవించి ఉన్న పౌరుల ఆధార్‌ ఐడీ పొరపాటున డీయాక్టివేట్‌ అయితే తిరిగి పునరుద్ధరణ(రీయాక్టివేట్‌)కు సైతం ప్రభుత్వం సౌకర్యం కల్పించింది. తాము జీవించే ఉన్నామని తెలిపే ఆధారాలను సమరి్పస్తే వెంటనే పాత ఐడీ కార్డును రీయాక్టివేట్‌ చేస్తారు. మృతుల ఆధార్‌ ఐడీలను తొలగించే క్రతువుకు అధికారులు 2024 ఏడాదిలోనే మొదలెట్టారు. అది ఈ ఏడాది పొడవునా కొనసాగుతోంది. ఈ ఏడాది జూలై రెండోవారం నాటికి 1.17 కోట్ల ఐడీలను తొలగించారు.

 సెపె్టంబర్‌ నాటికి 1.4 కోట్ల ఐడీలు, తాజాగా 2 కోట్లకుపైగా ఐడీలను తొలగించారు. అయితే ఇప్పటికే పలు రాష్ట్రాల్లో పౌర నమోదు వ్యవస్థలు సరిగా పనిచేయడం లేదు. ఏ జిల్లాలో ఎంత మంది మరణించారనే వాస్తవిక గణాంకాలు కూడా చాలా రాష్ట్రాల వద్ద సమగ్రస్థాయిలో లేవు. ఇలాంటి అస్పష్టతల నడుమ ఉన్నపళంగా ఆధార్‌ ఐడీలను క్రియాశీలక స్థితి నుంచి తప్పిస్తే ఎంతో మంది పౌరులు అవస్థలు పడతారని సామాజికరంగ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. సంక్షేమ పథకాల అమలులో ఈ ఆధార్‌ఐడీల పొరపాటు తొలగింపు అనేది పెద్ద అవరోధంగా మారుతుందని వాళ్లు వ్యాఖ్యానించారు.   
 

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)