Breaking News

సబ్జెక్ట్‌తో పనిలేకుండా డిగ్రీ, పీజీల్లో ఏ కోర్సులో అయినా చేరొచ్చు

Published on Fri, 12/06/2024 - 06:24

న్యూఢిల్లీ: ఇంటర్మీడియట్‌లో చదువుకున్న సబ్జెక్టులతో సంబంధం లేకుండా ఇకపై నచ్చిన గ్రూప్‌లో డిగ్రీ, అలాగే డిగ్రీ పట్టభద్రులు నచ్చిన కోర్సులో పీజీ చేసేందుకు అవకాశం కల్పిస్తూ యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌(యూజీసీ) వినూత్న నిర్ణయం తీసుకోనుంది. జాతీయ లేదా యూనివర్సిటీ స్థాయి ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన వారికి ఈ వెసులుబాటు కల్పించాలని యూజీసీ యోచిస్తోంది. 

డిగ్రీ, పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించిన కొత్త ముసాయిదా నిబంధనావళిని యూజీసీ గురువారం వెలువరించింది. ఆయా వివరాలను యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ వివరించారు. ‘‘ లెవల్‌ 4 లేదా 12వ తరగతి పూర్తిచేసుకున్న విద్యార్థి ఇకపై తనకు నచ్చిన కోర్సు అంటే బీఎస్సీ, బీఏ, ఇలా ఇంటర్మీడియట్‌ సబ్జెక్టులతో సంబంధంలేకుండా భిన్నమైన కోర్సుల్లో డిగ్రీలో చేరొచ్చు.

 డిగ్రీ పట్టభద్రులు.. పోస్ట్‌గ్రాడ్యుయేట్‌ కోసం తమకు నచ్చిన భిన్నమైన కోర్సుల్లో చేరొచ్చు. నేషనల్‌ క్రెడిట్‌ ఫ్రేమ్‌వర్క్‌కు అనుగుణంగా ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణులైన విద్యార్థులు నేరుగా డిగ్రీ రెండో ఏడాది, మూడో ఏడాది, నాలుగో ఏడాదిలోనూ చేరొచ్చు. ఎంత మందిని చేర్చుకోవాలనేది ఖాళీలను బట్టి ఆయా యూనివర్సిటీలు నిర్ణయం తీసుకుంటాయి. ఇకపై ప్రధాన సబ్జెక్ట్‌ నుంచి 50 శాతం  క్రెడిట్స్, మిగతా క్రెడిట్స్‌ను నైపుణ్యాభివృద్ధి, అప్రెంటిస్‌షిప్, సబ్జెక్టుల ద్వారా పొందొచ్చు’’ అని జగదీశ్‌ చెప్పారు. 

Videos

సాక్షి ఇన్వెస్టిగేషన్ లో సంచలన విషయాలు.. DSC అక్రమాలపై తిరుగులేని సాక్ష్యాలు

అమెరికా యుద్ధ నౌకలపై ఇరాన్ క్షిపణి దాడులు

ACల దొంగలు.. వైరల్ అవుతున్న వీడియో

ధురంధర్ డైరెక్టర్ తో టాక్సిక్ హీరో.. పాన్ ఇండియా షేక్ చేసే కాంబో?

శ్రీ చరణి దెబ్బ అదుర్స్! 55 పరుగులకే పాక్ ఆలౌట్..

టీచర్ ఉద్యోగం కోసం 12 లక్షలు అడిగారు.. లోకేష్ మనుషులు వచ్చి మాట్లాడుతారు అంటూ..

SBI గుడ్ న్యూస్.. రూ.15 లక్షల స్కాలర్ షిప్!

10 రోజులుగా శిథిలాల కింద.. చివరకు ప్రాణాలతో బయటకు..!

DSCలో స్కాం జరగకపోతే CBI విచారణకు సిద్ధమా..?

పుట్టలో పాముల్లా బయటికొస్తున్న DSC అక్రమాలు

Photos

+5

‘కామ్రేడ్‌ కళ్యాణ్‌’ టీజర్‌ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో సీరియల్ బ్యూటీ.. బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ (ఫొటోలు)

+5

చెన్నైలో నా రోజు ఇలా గడిచింది (ఫొటోలు)

+5

అగ్నిపరీక్షలో గెలిచి 'బిగ్‌బాస్' 10లోకి రైతుబిడ్డ ఎంట్రీ (ఫొటోలు)

+5

దేవకన్యలా 'మ్యాడ్' ఫేమ్ అనంతిక (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో ‘రన్ ఫర్ నేచర్'(ఫొటోలు)

+5

పింక్ బ్యూటీ ప్రియాంక మోహన్ (ఫొటోలు)

+5

'మారెమ్మ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

డీఎస్సీలో అక్రమాలపై వైఎస్సార్‌సీపీ ‘గురు పరిరక్షణ దీక్ష’ (ఫొటోలు)

+5

'తెల్ల కాగితం' సినిమా టీజర్ లాంచ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)