Breaking News

ఫోన్‌ మోడల్‌ను బట్టి  క్యాబ్‌ చార్జీలా? 

Published on Fri, 01/24/2025 - 05:57

న్యూఢిల్లీ: నగరాలు, పట్టణాల్లో క్యాబ్‌ల కోసం ఓలా లేదా ఉబర్‌లో బుక్‌ చేసుకోవడం పరిపాటిగా మారింది. ఇందుకోసం స్మార్ట్‌ఫోన్‌లో సంబంధిత యాప్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సి ఉంటుంది. క్యాబ్‌ బుకింగ్‌ కోసం ఉపయోగించిన ఫోన్‌ మోడల్‌ను బట్టి చార్జీలు మారుతుంటాయా? మారుతున్నాయనే చెబుతున్నారు. ఖరీదైన ఫోన్‌ నుంచి బుక్‌ చేస్తే ఎక్కువ చార్జీ, చౌకరకం ఫోన్‌ నుంచి బుక్‌ చేస్తే తక్కువ చార్జీ వసూలు చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 సంబంధిత యాప్‌ల్లో ఈ మేరకు మార్పులు చేర్పులు చేసినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఓలా, ఉబర్‌ల నిర్వాకంపై చాలామంది ఫిర్యాదులు చేస్తున్నారు. ఈ వ్యవహారంపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ(సీసీపీఏ) స్పందించింది. ఓలా, ఉబర్‌లకు గురువారం నోటీసులు జారీ చేసింది. ఫోన్‌ మోడల్‌ను బట్టి క్యాబ్‌ చార్జీలు వసూలు చేస్తున్నట్లు వెల్లువెత్తుతున్న ఆరోపణలపై వివరణ ఇవ్వాలని ఆదేశించింది. 

ఐఫోన్‌ నుంచి బుక్‌ చేస్తే ఒకరకంగా, ఆండ్రాయిడ్‌ స్మార్ట్‌ఫోన్‌ నుంచి బుక్‌ చేస్తే మరోరకంగా చార్జీలు విధిస్తుండడం నిజమేనా? అని ప్రశ్నించింది. ఒకే రకమైన సేవకు రెండు భిన్నమైన చార్జీలా? అని నిలదీసింది.  చార్జీల విధిస్తున్న విధానం ఏమిటో చెప్పాలని పేర్కొంది. వినియోగదారుల నువంచి చార్జీల వసూలులో పూర్తి పారదర్శకత ఉండాలని సీసీపీఏ స్పష్టంచేసింది. ఒకేచోటు నుంచి ఒకే గమ్యస్థానానికి రెండు రకాల ఫోన్ల నుంచి రెండు క్యాబ్‌లు బుక్‌ చేస్తే రెండు రకాల చార్జీలు వసూలు చేసినట్లు ఢిల్లీకి ఓ వ్యాపారవేత్త బయటపెట్టడంతో ఈ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దీనిపై కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషీ స్పందించారు. ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి యాప్‌లపై విచారణ జరపాలని సీసీపీఏను ఆదేశించారు.   
 

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)