Breaking News

Chhattisgarh: మావోయిస్టులకు భారీ దెబ్బ

Published on Sat, 01/17/2026 - 12:23

ఛత్తీస్‌గఢ్‌: బీజాపూర్ జిల్లా అటవీ ప్రాంతంలో శనివారం ఉదయం జరిగిన ఎన్‌కౌంటర్‌లో మావోయిస్టు పార్టీ అగ్రనేత, దక్షిణ బస్తర్ డివిజన్ కమిటీ కార్యదర్శి పాపారావు అలియాస్ చంద్రయ్య అలియాస్ మంగు మృతి చెందినట్లు సమాచారం. ఒక మహిళతో సహా నలుగురు మావోయిస్టులు మరణించారు. ఈ ఘటన మావోయిస్టు వర్గాల్లోనే కాకుండా భద్రతా బలగాల్లోనూ కీలక పరిణామంగా మారింది.

సుక్మా జిల్లా కిష్టారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని నిమ్మలగూడెం గ్రామానికి చెందిన సున్నం చంద్రయ్య (56) గత మూడు దశాబ్దాలుగా మావోయిస్టు పార్టీలో కీలక పాత్ర పోషించాడు. దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడిగా కొనసాగుతున్న చంద్రయ్య , బస్తర్ ప్రాంతంలో మిగిలి ఉన్న అగ్రనేతల్లో అత్యంత కీలక నేతగా పేరొందాడు. పాపారావుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ.50 లక్షల రివార్డు ప్రకటించాయి. అతడిని మట్టు పెట్టేందుకు భద్రతా బలగాలు గత కొంతకాలంగా ప్రత్యేక ఆపరేషన్‌ను ముమ్మరం చేశాయి. మార్చి 2026 నాటికి పాపారావును నిర్వీర్యం చేస్తామని లక్ష్యంగా పెట్టుకున్న బలగాలు, ఆ గడువు కంటే రెండు నెలల ముందే విజయం సాధించాయి.

పాపారావు తన ఫోటో కూడా భద్రతా బలగాలకు చిక్కకుండా అత్యంత జాగ్రత్తగా వ్యవహరించిన నేతగా గుర్తింపు పొందాడు. నేటికీ పోలీసుల వద్ద ఉన్నది ఏదో ఒక పాత ఫోటో మాత్రమేనని అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి 6న కుట్రు–బెద్రే రహదారిపై భద్రతా బలగాలు ప్రయాణిస్తున్న వాహనాన్ని ఐఈడీ బాంబుతో పేల్చిన ఘటనలో పాపారావు కీలక సూత్రధారి, మాస్టర్‌మైండ్‌గా ఆరోపణలు ఎదుర్కొన్నాడు. ఆ దాడిలో ఎనిమిది మంది జవాన్లు అక్కడికక్కడే మృతి చెందగా, ఒక ప్రైవేట్ డ్రైవర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఎన్‌కౌంటర్‌తో బస్తర్ ప్రాంతంలో మావోయిస్టు కార్యకలాపాలకు భారీ ఎదురుదెబ్బ తగిలినట్లు భద్రతా వర్గాలు భావిస్తున్నాయి. 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)