Breaking News

Uttarakhand: భూములు కొనేందుకు వారికి నో !

Published on Wed, 12/27/2023 - 13:53

డెహ్రాడూన్‌: పర్యాటక రాష్ట్రం ఉత్తరాఖండ్‌లో భూములు కొనాలనుకుంటున్నారా. అయితే ఇక అది కుదరకపోవచ్చు. రాష్ట్రంలోని గ్రామీణ కొండ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు భూములు కొనకుండా సీఎం పుష్కర్‌ సింగ్‌ దామి నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం త్వరలో ఒక చట్టం తీసుకువచ్చే అవకాశం ఉంది. ఇదే తరహాలో చట్టం తీసుకువచ్చిన మరో పర్యాటక రాష్ట్రం హిమాచల్‌ ప్రదేశ్‌ స్ఫూర్తిగా ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

ఉత్తరాఖండ్‌ గ్రామీణ కొండ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించే విషయంలో ఏర్పాటు చేసిన కమిటీ ఇప్పటికే ఒక నివేదిక ప్రభుత్వానికి ఇచ్చింది. గ్రామీణ ప్రాంతాల్లో రాష్ట్రం బయటివారు పూర్తిగా భూములు కొనుగోలు చేయకుండా నిరోధించడం, పట్టణ ప్రాంతాల్లో భూముల కొనుగోలుపై పరిమితులు విధించాలని కమిటీ తన నివేదికలో సిఫారసు చేసింది. ఈ నివేదిక ఆధారంగానే ప్రభుత్వం కొత్త చట్టం తీసుకురానున్నట్లు అధికారులు చెబుతున్నారు. 

బయటివారు భూములు కొనుగోలు చేయడంపై స్థానికుల నుంచి నిరసనలు వెల్లువెత్తడంతోనే ప్రభుత్వం ఈ చట్టం తీసుకువచ్చేందుకు నిర్ణయించిందని తెలుస్తోంది. అయితే భూ చట్టాల్లో మార్పులు చేయడం ఉత్తరాఖండ్‌లో ఆనవాయితీగా వస్తోంది. గతంలో ఉన్న ప్రభుత్వాలు రాష్ట్రంలో భూముల కొనుగోలుపై ఆంక్షలు విధించడం పెట్టుబడుల పేరు చెప్పి మళ్లీ వాటిని ఎత్తివేయడం చేస్తూనే వస్తుండడం విశేషం. 

ఇదీచదవండి..రామ మందిర వేడుకకు మమతా బెనర్జీ దూరం?

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)