Breaking News

కరూర్‌ తొక్కిసలాట ఘటన కేసులో కీలక పరిణామం

Published on Tue, 01/13/2026 - 21:00

న్యూఢిల్లీ: కరూర్‌ తొక్కిసలాట ఘటనలో కీలక పరిణామం చోటు చేసుకుంది. తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత, హీరో విజయ్‌కు సీబీఐ రెండోసారి నోటీసులు జారీ చేసింది. జనవరి 19న కరూర్‌ తొక్కిసలాట కేసు దర్యాప్తుకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నట్లు సమాచారం.

టీవీకే నిర్వహించిన బహిరంగ సభలో 41 మంది ప్రాణాలు కోల్పోయిన దుర్ఘటనపై సోమవారం ఢిల్లీలోని సీబీఐ అధికారులు విచారణ జరిపారు. ఈ విచారణకు విజయ్ హాజరయ్యారు. ఆరుగంటల పాటు జరిగిన ఈ దర్యాప్తులో.. కరూర్‌ తొక్కిసలాటకు తమ పార్టీకి సంబంధం లేదని విజయ్ చెప్పినట్లు జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి. 

గతేడాది సెప్టెంబర్ 27న జరిగిన ఈ విషాద ఘటనపై మద్రాస్ హైకోర్టు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేసింది. అనంతరం తమిళనాడు ప్రభుత్వం ఒక సభ్యుడితో కమిషన్ ఏర్పాటు చేసింది. అయితే సుప్రీం కోర్టు మరింత లోతైన దర్యాప్తు అవసరమని భావించి ఆ కమిషన్‌ను రద్దు చేసింది. కేసును సీబీఐకి బదిలీ చేస్తూ, రిటైర్డ్ సుప్రీం కోర్టు జడ్జి ఆధ్వర్యంలో ప్యానెల్ పర్యవేక్షణలో దర్యాప్తు జరగాలని ఆదేశించింది.

కరూర్‌లో విజయ్‌ నిర్వహించిన భారీ బహిరంగ సభలో తొక్కిసలాట జరిగింది. ఈ దుర్ఘటనలో భారీ ఎత్తున ప్రాణ నష్టం జరిగింది. అందుకు సభకు వచ్చిన అభిమానులు,కార్యకర్తలకు తగిన ఏర్పాట్లు చేయకపోవడం,ఆహారం,నీరు,మరుగుదొడ్డి వంటి కనీస సౌకర్యాలు ఏర్పాటు చేయలేకపోయింది. ఫలితంగా పరిస్థితి అదుపు తప్పింది. విజయ్ ఆలస్యంగా వేదికకు చేరుకోవడం కూడా గందరగోళానికి కారణమైందని తమిళనాడు పోలీసులు ఆరోపించారు.

తమిళనాడు పోలీసులు ఈ ఘటనకు విజయ్ ఆలస్యమే కారణమని పేర్కొన్నారు. అయితే విజయ్ ఈ ఆరోపణలను ఖండించారు. అధికార డీఎంకే కుట్రగా ఆరోపణలు గుప్పించారు.  పోలీసులే సరైన క్రౌడ్‌మేనేజ్మెంట్‌ చేయలేకపోవడం, రహదారులపై ట్రాఫిక్‌ నియంత్రించ లేకపోవడం వల్లే ఈ విషాదం చోటుచేసుకుందని అన్నారు.

ఈ ఘటన తమిళనాడులో ఇటీవల కాలంలో జరిగిన అత్యంత ఘోర ప్రమాదంగా నిలిచింది. 41 మంది ప్రాణాలు కోల్పోవడం రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చలకు దారితీసింది. విజయ్ రాజకీయ ప్రస్థానంపై ఈ కేసు ప్రభావం చూపనుందని విశ్లేషకులు భావిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)