Breaking News

పసుపుతో మధుమేహానికి చెక్‌

Published on Sun, 08/10/2025 - 05:31

సాక్షి, న్యూఢిల్లీ: తెలుగు రాష్ట్రాల్లో విస్తృతంగా సాగయ్యే పసుపులో అద్భుత ఔషధ గుణాలున్నట్లు వివిధ సంస్థలు చేపట్టిన పరిశోధనల్లో మరోసారి రుజువైందని కేంద్రం తెలిపింది. పసుపులో ఉండే కర్క్యూమిన్‌ అనే కీలక రసాయనానికి వివిధ ఆరోగ్య సమస్యలకు ఉపశమనం కలిగించే సత్తా ఉన్నట్లు తేలిందని వెల్లడించింది. ఇండియన్‌ కౌన్సి ల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ (ఐసీఎంఆర్‌) పసుపుపై మోనోగ్రాఫ్‌ను తయారు చేసిందని తెలిపింది. ఇందులో ఔషధ గుణాలు, బయోయాక్టివిటీస్, ఫైటోకెమికల్స్, దుష్ప్రభావాలు తదితర అంశాలను పొందుపరిచిందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. పసుపు–దాల్చినచెక్క మిశ్రమంతో డయాబెటిస్‌ పీడిత జంతువులపై జరిపిన ప్రయోగాల్లో రక్తంలో చక్కెర స్థాయిలు, కొలెస్ట్రాల్‌ స్థాయిలు గణనీయంగా తగ్గినట్లు కోజికోడ్‌లోని భారత సుగంధ ద్రవ్యాల పరిశోధనా సంస్థ (ఐసీఏఆర్‌) వెల్లడించింది.

పసుపుతో ఎలాంటి దుష్ప్రభావం లేదు:
ఆయుర్వేదిక పరిశోధన మండలి ఆధ్వర్యంలో పసుపులో ఉండే 22 ఔషధ లక్షణాలకు సంబంధించిన 15 వ్యాధులపై క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామని తెలిపింది. ఇవి ప్రభావవంతంగా పనిచేసినట్లు తేలిందని కేంద్ర ఆరోగ్యశాఖ పేర్కొంది. అంతేగాక, పసుపు వల్ల కాలేయానికి హాని, రక్తం సరిగ్గా గడ్డకట్టకపోవడం వంటి ప్రభావాలపై జంతువులపై జరిపిన పరీక్షల్లో నెగిటివ్‌ ప్రభావాలు లేవని తేలిందని ఐఐఎస్‌ఆర్‌ తెలిపింది.

కర్క్యూమిన్‌ శాతం అధ్యయనం:
మరోవైపు ఫార్మకలాజికల్‌ ఉపయోగానికి సరైన కర్క్యూమిన్‌ శాతం ఉన్న పసుపు రకాలపై ఐసీఏఆర్‌ పరిశోధన చేసింది. ప్రతిభ, ప్రగతి, అలెప్పీ సుప్రీమ్, రోమా, రాజేంద్ర సోనియా వంటి రకాలలో 5 శాతం కంటే ఎక్కువగా కర్క్యూమిన్‌ ఉందని పేర్కొంది. ఈ రకాలను రైతులు అనేక రాష్ట్రాల్లో సాగుచేస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల్లోని లకాడాంగ్, మహారాష్ట్రలో వైగాన్‌ టర్మెరిక్‌ రకాలూ అధిక కర్క్యూమిన్‌ శాతం కలిగి ఉన్నాయని వెల్లడించారు. కాగా, పిప్పలాద్యాసవం, హరిద్రాఖండం, కల్యాణకఘృతం, నల్పమరాది తైలం, నిసా–ఆమలకి చూర్ణం వంటి అనేక ఆయుర్వేద ఔషధాల్లో పసుపు ముఖ్యమైన పదార్థంగా వాడుతున్నట్లు ప్రకటించారు. మొత్తంగా, పసుపు ఆరోగ్యానికి మేలు చేసే ఔషధ గుణాలపై కేంద్రం విస్తృత పరిశోధనలు నిర్వహించిందనీ, తగిన సమాచారాన్ని సేకరించిందని కేంద్ర ఆరోగ్యశాఖ సహాయ మంత్రి ప్రతాప్‌ రావు జాదవ్‌ ఇటీవల లోక్‌సభలో బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ అడిగిన ప్రశ్నకు ఇచ్చిన సమాధానంలో వివరించారు.  
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)