Breaking News

త్రిపురలో హైటెన్షన్‌.. బీజేపీ మాజీ సీఎం టార్గెట్‌గా దాడులు!

Published on Wed, 01/04/2023 - 07:29

త్రిపుర మాజీ ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్‌ ఇంటిపై దాడి జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు ఆయన ఇంటిపై దాడి చేసి, ఇంటికి నిప్పంటించారు. ఈ ఘటనలో ఇంటి బయట పార్క్‌ చేసి ఉన్న కారు, ఇతర వాహనాలు ధ్వంసమయ్యాయి. దీంతో, ఒక్కసారిగా త్రిపురలో ఉద్రిక్తకర వాతావరణం చోటుచేసుకుంది.

వివరాల ప్రకారం.. త్రిపుర మాజీ సీఎం, బీజేపీ నేత బిప్లబ్ దేబ్ పూర్వీకుల ఇంటిపై కొందరు గుర్తు తెలియని వ్యక్తులు దాడికి తెగబడ్డారు. ఉదయ్‌పూర్‌లోని జామ్‌జూరి ప్రాంతంలోని రాజ్‌నగర్‌లోని బిప్లబ్‌దేవ్‌ పూర్వీకుల ఇంటిపై దుండగులు దాడి చేసి, నిప్పంటించారు. మొత్తం ఇంటిని ధ్వంసం చేశారు. అంతటితో ఆగకుండా ఇంటి బయట పార్క్‌ చేసి ఉన్న వాహనాలకు నిప్పంటించారు. మరోవైపు.. బిప్లవ్‌ దేవ్‌ తండ్రి హిరుధన్‌ దేవ్‌ స్మారకార్థం బుధవారం కావడం కారణంగా ఈ దాడి జరిగినట్టు తెలుస్తోంది. ఈ తరుణంలో ఇలా జరగడం త్రిపురలో హాట్‌ టాపిక్‌గా మారింది. 

ఇదిలా ఉండగా.. ఈ దాడిపై బీజేపీ నేతలు సీరియస్‌గా స్పందిస్తున్నారు. ఈ దాడికి సీపీఎం మద్దతుదారులే కారణమని బీజేపీ నేతలు చెబుతున్నారు. అంతేకాకుండా.. దాడి చేసిన వారితో కక్రాబన్ ఎమ్మెల్యే రతన్ చక్రవర్తి మంగళవారం సమావేశమైనట్లు బీజేపీ నేతలు ఆరోపిస్తున్నారు. దాడి ఘటన సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి పోలీసులు చేరుకుని భద్రత ఏర్పాటు చేశారు. 

Videos

నమ్మినవాళ్లే నన్ను మోసం చేశారు..! కన్నీరు పెట్టిన బొత్స

అసలు సూత్రదారులు వీళ్లే..! ఆధారాలతో బయటపెట్టిన YS జగన్

ఎవరికీ పోస్టు ఇవ్వాలో మంగళగిరి నుంచి ఫోన్.. లైవ్ వీడియో ప్లే చేసి ఏకిపారేసిన జగన్

బాబు జైలుకెళ్లి మూడేళ్లు... వెళ్తూ వెళ్తూ జగన్ సెటైర్లు అదుర్స్

ఉక్రెయిన్ ఖజానా ఖాళీ... యుద్ధంతో దివాలా దిశగా..!

అరుదైన కోతులు.. ఇక్కడికి ఎలా వచ్చాయి! వీటి ధర తెలిస్తే దిమ్మతిరగాల్సిందే

ఐఫోన్ 18 వచ్చేసింది.. ఫీచర్స్ చూస్తే దిమ్మతిరగాల్సిందే

దద్దరిల్లిన కర్నూలు మెగా పోలీస్ నోటిఫికేషన్.. రోడ్డెక్కిన యువత

Gold: మళ్లీ పెరిగిన బంగారం తులం ఎంతంటే..?

15లక్షలకు DSC జాబ్ లు అమ్ముకున్నారు..! సంచలన వీడియో బయటపెట్టిన YS జగన్

Photos

+5

అప్పటి కాలేజ్‌ లుక్‌.. ఇప్పటి స్టార్‌ హీరోయిన్స్‌! (ఫోటోలు)

+5

కాఫీ కప్‌తో కీర్తి.. అదిరిన కాఫీ లుక్‌! (ఫోటోలు)

+5

సింపుల్ లుక్‌లోనే స్టన్నింగ్ బ్యూటీ భూమిక చావ్లా.. వైరల్ అవుతున్న ఫొటోలు

+5

స్టార్‌ నటి నిశ్చితార్థం ఫోటోలు వైరల్‌

+5

ఉదయభాను నిర్మాతగా ‘పంచనామా’ వెబ్‌సిరీస్‌ (ఫొటోలు)

+5

‘కళ్యాణం కమనీయం జీవితం’ మూవీ ట్రైలర్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

ప్రతి ఇంట్లో అదే చర్చ : వైఎస్‌ జగన్‌ (ఫొటోలు)

+5

సింపుల్ లుక్‌లో స్టన్నింగ్ బ్యూటీ.. శ్రీనిధి శెట్టి (ఫొటోలు)

+5

భార్యతో సుకుమార్.. 80s రెట్రో లుక్‌లో అదిరిపోయే.. (ఫొటోలు)

+5

రష్మిక పాత ఫొటోలు.. క్యూట్‌నెస్‌కు ఫిదా అవ్వాల్సిందే (ఫోటోలు)