Breaking News

లాల్‌ సలాం.. లాల్‌ సలాం

Published on Sun, 09/15/2024 - 04:49

సాక్షి, న్యూఢిల్లీ: అశ్రునయనాల మధ్య, కడసారి చూపు కోసం తరలివచ్చిన వేలాదిమంది అభిమానులు, కార్యకర్తల మధ్య కామ్రేడ్‌ సీతారాం ఏచూరి నివాళులు పూర్తి అయ్యాయి. దేశవ్యాప్తంగా వివిధ పార్టీలకు చెందిన ప్రముఖులు, నేతలు ఏచూరికి తుది వీడ్కోలు పలికారు. కాంగ్రెస్‌ పార్లమెంటరీ పార్టీ చైర్‌పర్సన్‌ సోనియా గాం«దీ, కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్, సీపీఎం పోలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కారత్, బృందా కారత్, వైఎస్సార్‌సీపీ ఎంపీ విజయసాయి రెడ్డి, తదితర ప్రముఖులు ఏచూరి పారి్థవ దేహానికి ఘన నివాళులు అర్పించారు. 

ఎన్సీపీ చీఫ్‌ శరద్‌ పవార్, ఎస్పీ అధినేత అఖిలేశ్‌ యాదవ్, సచిన్‌ పైలట్, డీఎంకే పార్టీ మంత్రి ఉదయనిధి స్టాలిన్, ఎంపీ కనిమొళి, టీఆర్‌ బాలు, దయానిధి మారన్, ఆప్‌ నేత మనీశ్‌ సిసోడియా, కాంగ్రెస్‌ నేతలు చిదంబరం, జైరాం రమేష్, అజయ్‌ మాకెన్, రాజీవ్‌ శుక్లా, ఆప్‌ ఎంపీ రాఘవ్‌ చద్దా, ఎమ్మార్పిఎస్‌ అధ్యక్షుడు మంద కృష్ణమాదిగ, బీఆర్‌ఎస్‌ ఎంపీ కేఆర్‌ సురేశ్‌ రెడ్డి తదితరులు నివాళులు అర్పించారు. సీపీఐ ప్రధాన కార్యదర్శి డి.రాజా, చైనా, వియత్నాం రాయబారులు నివాళులర్పించారు. 

అనంతరం ఏచూరి భార్య సీమాచిస్తీ, కుమార్తె అఖిల, కుమారుడు డాని‹Ùలను పరామర్శించి మనోధైర్యం కల్పించారు. ఏచూరిని కడసారి చూసేందుకు దేశవ్యాప్తంగా ఉన్న ఎస్‌ఎఫ్‌ఐ బృందం, ఢిల్లీ జేఎన్‌యూ విద్యార్థి సంఘాలు, వివిధ రాష్ట్రాలకు చెందిన పార్టీ కార్యకర్తలు, విదేశాలకు చెందిన పార్టీ నేతలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. 

ఢిల్లీ గోల్‌మార్కెట్‌లోని సీపీఎం కేంద్ర కార్యాలయం నుంచి ఎయిమ్స్‌ వరకు అంతిమ యాత్ర నిర్వహించారు. జోరు వానను లెక్కచేయకుండా ‘ఇక సెలవు కామ్రేడ్, రెడ్‌ సెల్యూట్‌ ఏచూరి’అంటూ నినాదాలు చేశారు. సాయంత్రం 6 గంటలకు వైద్య విద్యార్థుల పరిశోధనల నిమిత్తం ఏచూరి పార్థివ దేహాన్ని కుటుంబీకులు, పార్టీ నేతలు ఎయిమ్స్‌కు అప్పగించారు.

Videos

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు