ఖర్చు ఎక్కువైనా మంచి వైద్యం అందాల్సిందే..

Published on Sat, 10/11/2025 - 05:14

ఆరోగ్య సమస్య తలెత్తితే ఎక్కడ వైద్యం చేయించుకోవాలి అన్నది దాదాపు ప్రతి ఇంటా ఓ సవాలే. సమస్యకు సత్వర పరిష్కారంతో పాటు ఖర్చులు భారం కాకుండా నమ్మకమైన చికిత్స కోసం ఏ హాస్పిటల్‌ని, ఏ వైద్యుడిని సంప్రదించాలో సన్నిహితులు, స్నేహితుల సలహా తీసుకోవడమూ సహజమే. అయితే మన దేశంలో అత్యధికులు ఆరోగ్య సంరక్షణలో మరింత పారదర్శకతను కోరుకుంటున్నారు. ఈ మేరకు ఆరోగ్య సేవలు నిర్దిష్ట నాణ్యత ప్రమాణాలకు (సర్టిఫైడ్‌) అనుగుణంగా లభిస్తే ప్రీమియం చెల్లించడానికి సైతం సిద్ధంగా ఉన్నారని ఓ నివేదిక చెబుతోంది.  

అధిక నాణ్యతకే ప్రాధాన్యం
ఫిక్కీ, ఈవై–పార్థనాన్‌ తాజా నివేదిక ప్రకారం.. మన దేశంలో వైద్యానికి సంబంధించిన సరైన సమాచారం మూడింట ఒక వంతు మందికి మాత్రమే సులభంగా లభిస్తోంది. బ్రాండ్‌ లేదా వైద్యుడికి ఉన్న పేరు ప్రఖ్యాతులపై 60%, నోటి మాటపై 79% మంది ఆధారపడుతున్నారు. 83% మంది రోగులు.. చికిత్స కోసం వెళ్లాల్సిన ఆసుపత్రి, ఎంచుకోవాల్సిన వైద్యుల ఎంపిక విషయంలో మార్గనిర్దేశం చేయడానికి నిష్పాక్షికమైన, అందుబాటులో ఉన్న సమాచారాన్ని కోరుకుంటున్నారు. ఇటువంటి సమాచారం కోరిన వారిలో దాదాపు 90% మంది సర్టిఫైడ్, అధిక–నాణ్యత గల ఆసుపత్రిలో వైద్యం కోసం ఎక్కువ చెల్లించేందుకు సిద్ధమని చెప్పారు.

మహమ్మారి తర్వాత మారిపోయింది..
వైద్య సేవలు ఎక్కడ మెరుగ్గా ఉంటాయో తెలుసుకోవడానికి భారతీయులు.. బంధువులు, సన్నిహితులపై ఆధారపడుతున్నారు. దశాబ్దాలుగా దాదాపు ప్రతి ఇంటా ఈ తంతు సహజంగా జరుగుతోంది. అయితే కోవిడ్‌–19 మహమ్మారి తర్వాత పరిస్థితుల్లో మార్పులు వస్తున్నాయని నివేదిక చెబుతోంది. ‘నిజంగా మంచి నాణ్యతతో వైద్యం లభిస్తుందా? ఏ ప్రాతిపదికన చెబుతున్నారు. నేను ఎలా గుర్తించాలి?’ అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయని నివేదిక పేర్కొంది. సేవల్లో పారదర్శకత కోసమే ఈ డిమాండ్‌ వస్తోందని తెలిపింది.

వార్షిక వినియోగాన్ని మించి వ్యయం!
అందుబాటు ధరలో వైద్యం అన్నది ఒక ప్రధాన అడ్డంకిగా మిగిలిపోయిందని నివేదిక తెలిపింది. ప్రై వేట్‌ ఆసుపత్రిలో చేరితే సగటు ఖర్చు రూ.58 వేలు అవుతోంది. ఇది దాదాపు సగం భారతీయ కుటుంబాలు, 70 శాతం గ్రామీణ కుటుంబాల వార్షిక వినియోగ వ్యయాన్ని మించి ఉండటం ఆందోళన కలిగిస్తోంది. రోగులు తమ జేబులకు చిల్లులు పడుతున్నాయని ఆందోళన చెందుతుండడంతో ఇది సున్నితమైన అంశంగా పరిణమించింది. కాగా, 10% కంటే తక్కువ ప్రైవేట్‌ ఆసుపత్రులు, 2%లోపు డయాగ్నోస్టిక్‌ ల్యాబ్‌లు ఎన్‌ఏబీఎల్‌ గుర్తింపును కలిగి ఉన్నాయని నివేదిక తెలిపింది.

పటిష్ట కార్యాచరణ అమలు చేయాలి
వైద్య సంబంధిత సమస్యలను పరిష్కరించడానికి సమన్వయంతో కూడిన బహుముఖ ప్రయత్నం అవసరమని నివేదిక వెల్లడించింది. మెరుగైన వైద్య సేవలు, వ్యయాలను దృష్టిలో పెట్టుకోవడం, వినియోగదారుల సాధికారతను నొక్కి చెబుతూ పటిష్ట కార్యాచరణ అమలు చేయాలని సూచించింది. మెడికల్‌ రీయింబర్స్‌మెంట్, కనెక్టెడ్‌ ఎకోసిస్టమ్‌ అమలు చేయాలని స్పష్టం చేసింది. సర్వేలో పాలుపంచుకున్న 90% మంది వైద్యులు నాణ్యత ప్రమాణాల ప్రాముఖ్యతను నొక్కిచెప్పారు.

ఎవరెవరు పాల్గొన్నారంటే..
సర్వేలో భారత్‌కు చెందిన 40 నగరాల్లోని 250 ఆసుప త్రులు పాలుపంచుకు న్నాయి. వీటి మొత్తం పడకల సామర్థ్యం 75 వేల పైచిలుకు ఉంది. 1,000 మందికిపైగా రోగులు, 100 మందికిపైగా వైద్యులు, 70 మందికి పైగా సీఈవోలు, సీనియర్‌ వైద్యులు, నిర్వాహకులు, పెట్టుబడిదారుల నుంచి సమాచారం సేకరించి వాటి ఆధారంగా నివేదిక రూపొందించారు.

Videos

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)