Breaking News

Madhya Pradesh: ఆర్మీ అధికారులపై దుండగుల దాడి.. ఒకరిపై అత్యాచారం

Published on Thu, 09/12/2024 - 07:22

భోపాల్‌: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటు చేసుకుంది. ఇద్దరు స్నేహితురాళ్లతో కలిసి మరో ఇద్దరు యువ ఆర్మీ అధికారులపై గుర్తు తెలియని దుండగులు తీవ్రంగా దాడిచేశారు. దోపిడీ చేయడానికి వచ్చిన దుండగులు.. వారిపై దాడి చేసి ఓ మహిళా అధికారిణిపై  అత్యాచారం చేసినట్లు బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్‌ తెలిపారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మోవ్ ఆర్మీ కాలేజీలో శిక్షణ తీసుకుంటున్న అధికారులు మంగళవారం జామ్‌లోని ఫైరింగ్ రేంజ్ సమీపంలో మహిళలతో కలిసి బయటకు వెళ్లారు. అకస్మాత్తుగా ఎనిమిది మంది దుండగులు తుపాకులు, కత్తులు కర్రలతో వారిని చుట్టుముట్టారు. ట్రైనీ ఆఫీసర్లు, మహిళల డబ్బు, వస్తువులను దోచుకునే ముందు వారిపై దాడి చేశారు. ఒక మహిళను, మరో ఆర్వీ అధికారిని బందీలుగా పట్టుకుని.. మిగతా ఇద్దరు రూ.10 లక్షల  ఇవ్వాలని అలాఅయితే వారివద్ద ఉన్న అధికారులను వదిపెడతామని డిమాండ్‌ చేశారు. ట్రైనింగ్‌ సెంటర్‌ వెళ్లిన యువ అధికారులు మోవ్‌ ఆర్మీ కాలేజీ అధికారులు, పోలీసులకు సమాచారం అధించారు. దీంతో పోలీసులను అప్రమత్తమై.. సంఘటనా స్థలానికి చేరుకున్నారు. పోలీసులు రావటాన్ని గమనించిన దుండగులు  అక్కడి నుంచి పారిపోయారు. 

గాయపడిన నలుగురినీ వైద్య పరీక్షల నిమిత్తం మోవ్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. ఇద్దరు అధికారులు గాయపడినట్లు డాక్టర్లు తెలిపారు. అదేవిధంగా వైద్య పరీక్షల్లో ఒక మహిళపై అత్యాచారం జరిగినట్లు తెలిసిందని బద్గొండ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ లోకేంద్ర సింగ్ హిరోర్‌ తెలిపారు. నిందితుల్లో ఇద్దరిని  అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఒకరికి గతంలో నేర చరిత్ర ఉన్నట్లు పేర్కొన్నారు. నాలుగు పోలీసు స్టేషన్లకు చెందిన సిబ్బంది రంగంలోకి దిగి నేరస్తుల కోసం గాలింపు చేపట్టినట్లు పోలీసులు చెప్పారు.

చదవండి:  ప్రజ్వల్‌కు చీర చిక్కు

Videos

జగ్గయ్యపేటలో YSRCP ప్రచార జోరు..

షర్మిళకు YS జగన్ రాసిన లేఖను రిలీజ్ చేసి... చంద్రబాబుకు దిమ్మతిరిగే కౌంటర్

జైలర్ 2 పై అల్లు అర్జున్ షాకింగ్ ట్వీట్ వైరల్

ప్రభాస్ బర్త్‌డే స్పెషల్... కల్కీ 2 నుంచి అదిరిపోయే వీడియో

వైఎస్ షర్మిలకు వైఎస్ జగన్ లేఖ

మే. 2029 వరకు మీరు తగ్గకండి నేను తగ్గను... నేను చాగంటి లా ప్రవచనాలు చెప్పే రకం కాదు

భయపడేవాడు ఎవడూ లేడు... కోయ ప్రవీణ్.. ఖాకీ డ్రెస్ బదులు టీడీపీ జెండా కట్టుకో

RC 17 పై క్లారిటీ ఇచ్చిన సుకుమార్

ఏపీలో ప్రజాస్వామ్యం బతికే ఉందా?

ధరల పెరుగుదలపై లోకేష్‌కు వరుదు కళ్యాణి సవాల్..!

Photos

+5

యాంకర్‌ సుమ ఈవెంట్‌కి చీఫ్‌ గెస్ట్‌గా మెగా కోడలు (ఫోటోలు)

+5

'రోమియో జూలియట్' సారీ బేబీ పాట విడుదల (ఫొటోలు)

+5

నిండుగా రెడీ అయిన అదాశర్మ (ఫొటోలు)

+5

ఎన్నాళ్లకెన్నాళ్లకు 'కొత్త బంగారు లోకం' బ్యూటీ ఇలా (ఫొటోలు)

+5

టాలీవుడ్ హీరోయిన్ బర్త్ డే సెలబ్రేషన్‌ (ఫొటోలు)

+5

ఏపీలో వైఎస్సార్‌సీపీ ఎన్నికల ప్రచార హోరు (ఫొటోలు)

+5

సందడిగా 'ఆదర్శ కుటుంబం' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

క్యూట్ నాగదుర్గ.. త్వరలో శ్రీలతగా థియేటర్లలోకి (ఫొటోలు)

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)