Breaking News

Uttar Pradesh: తప్పిన రైలు ప్రమాదం.. అనుమానిత వస్తువులు స్వాధీనం

Published on Mon, 09/09/2024 - 06:55

కాన్పూర్: ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో తృటిలో ఘోర రైలు ప్రమాదం తప్పింది. కాన్పూర్‌లోని అన్వర్‌గంజ్-కాస్‌గంజ్ రైలు మార్గంలో భివానీకి వెళ్లే కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గురయ్యింది. వేగంగా వెళుతున్న ఈ  రైలు..  పట్టాలపై ఎవరో ఉంచిన సిలిండర్‌ను బలంగా ఢీకొంది. ఈ ఘటన వెనుక కుట్ర  దాగివుందని రైల్వే వర్గాలు అనుమానం వ్యక్తం చేస్తున్నాయి.

మీడియాకు అందిన వివరాల ప్రకారం కాళింది ఎక్స్‌ప్రెస్ ప్రయాగ్‌రాజ్ నుండి కాన్పూర్ సెంట్రల్ మీదుగా భివానీకి వెళ్తోంది. శివరాజ్‌పూర్ సమీపంలో సిలిండర్‌తో పాటు మరికొన్ని వస్తువులను ఈ రైలు ఢీకొంది. ఈ ఘటనపై సమాచారం అందుకున్న ఆర్పీఎఫ్‌ బృందం సంఘటనా ‍స్థలానికి చేరుకుని దర్యాప్తు ప్రారంభించింది.

విచారణ అనంతరం ఆర్‌పీఎఫ్ ఇన్‌స్పెక్టర్  ఓపీ మీనా బృందం సిలిండర్‌ను స్వాధీనం చేసుకుంది. అలాగే సంఘటనా స్థలంలోపలు అనుమానాస్పద వస్తువులను కూడా స్వాధీనం చేసుకున్నారు. సిలిండర్ దొరికిన ప్రదేశంలో ఒక సీసాలో పసుపు రంగు పదార్థం, తెల్లటి పొడి కనిపించింది. రైలును కొద్దిసేపు నిలిపివేసి, ఆ మార్గాన్ని పరిశీలించిన అనంతరం ఆ రైలును ముందుకు వెళ్లేందుకు అధికారులు అనుమతించారు. ఈ ఘటనపై రైల్వే అధికారులు దర్యాప్తు చేస్తున్నారు.

Videos

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

ఉద్యోగుల ఆగ్రహం.. బాబుకు షాక్..! మా డబ్బులు మాకు ఇవ్వండి

బంగారం కొనేవాళ్లకు ఇది గుడ్ న్యూస్.. GOLD రేట్లు ఇంకా తగ్గుతాయా?

సీఎం రేవంత్ మార్పు ఖాయం? BRS రాకేష్ కుమార్ షాకింగ్ కామెంట్స్

గుంటూరు పెదకాకానిలో హై టెన్షన్

జనసేన MLAపై బాబు సీరియస్

స్మృతి మందాన రికార్డు సెంచరీ.. సెమిస్ లో భారత్

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు