Breaking News

‘చెక్క’నైన చాక్లెట్‌

Published on Sun, 06/21/2026 - 01:36

చాక్లెట్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? పిల్లల నుంచి పెద్దల దాకా చాక్లెట్‌ అంటే నచ్చని వారుండరు అంటే అతిశయోక్తి కాదు. కొన్ని చాక్లెట్లు గట్టిగా, కొన్ని మెత్తగా ఉంటాయి. నోట్లో వేసుకోగానే మంచులా కరిగిపోయే చాక్లెట్‌ను ఎప్పుడైనా చూశారా? జపాన్‌కు చెందిన ఒక మిఠాయి తయారీ సంస్థ ప్రపంచంలోనే అత్యంత పలుచనైన చాక్లెట్‌ను తీసుకొచ్చింది.

ఇటలీకి చెందిన సంప్రదాయ పొరల చాక్లెట్ల నుంచి ప్రేరణ పొంది తయారుచేసిన ఈ చాక్లెట్‌కు ‘కోర్టెసియా’అని పేరు పెట్టారు. ఇటాలియన్‌ భాషలో దీనికి ‘చెట్టు బెరడు’అని అర్థం. కేవలం 0.03 మిల్లీమీటర్ల పలుచని చాక్లెట్‌ పొరను తీసుకుని, చెట్టు బెరడుతో కప్పినట్టు గుండ్రటి కొమ్మను పోలిన ఆకారంలోకి దీన్ని చుడతారు. ఇంతటి సూక్ష్మమైన చాక్లెట్‌ పొర ను సాధారణ యంత్రాలతో తయారు చేయడం అసాధ్యం. ఇందుకోసం ఒక స్థానిక యంత్రాల నిపుణుడి సహకారంతో దాదాపు ఒకటిన్నర సంవత్సరానికి పైగా శ్రమించి, ఒక ప్రత్యేకమైన మెషీన్‌ను తయారుచేశారు.

ఈ యంత్రం ద్వారా చాక్లెట్‌ను అత్యంత నైపుణ్యంతో ఒకే ఒక పలుచని పొరలాగా చుడతారు. చాక్లెట్‌ నోట్లో పూర్తిగా కరుగుతుంటే దాని రుచే వేరని.. అందుకే తాము ఇలా తయారుచేశామని ఈ చాక్లెట్‌ తయారీ కంపెనీ వ్యవస్థాపకుడు శాన్‌క్లిక్కా చెబుతున్నారు. ఈ విభిన్నమైన డెజర్ట్‌ సోషల్‌ మీడియాలో విపరీతంగా వైరల్‌ అయిన తర్వాత, ప్రపంచవ్యాప్తంగా చాలా మంది చెఫ్‌లు, ప్రముఖ సంస్థలు కోర్టెసియాను అనుకరించడానికి ప్రయత్నించాయి. కానీ ఇప్పటివరకు అది ఎవరికీ సాధ్యం కాలేదు! ఎందుకంటే, ఆ చాక్లెట్‌ను అంత పలుచగా నొక్కడానికి ఉపయోగించే ప్రత్యేకమైన యంత్రం ప్రపంచం మొత్తం మీద ఒకే ఒక్కటి ఉంది కాబట్టి. ఈ చాక్లెట్‌ గురించి తెలిశాక మీకూ తినాలని అనిపిస్తోందా అయితే జపాన్‌కు వెళ్లాల్సిందే! 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)