Breaking News

కశ్మీర్‌కు పర్యాటక కళ

Published on Mon, 04/28/2025 - 05:40

కశ్మీర్‌ నెత్తుటి మరకలను తుడుచుకుంది. పాశవిక దాడి తాలూకు చేదు అనుభవం నుంచి చూస్తుండగానే తేరుకుంది. పర్యాటకులను ఆప్యాయంగా అక్కున చేర్చుకుంటోంది. దాడి నేపథ్యంలో భయాందోళనలతో లోయను వీడిన టూరిస్టులు ఇప్పుడు అక్కడికి తిరిగి వెళ్తున్నారు. ఉగ్ర దాడుల ఆందోళనలు పూర్తిగా తొలగకపోయినా దేశమంతా ఏకమై ఉందని చెప్పడానికి కశ్మీర్‌ను సందర్శిస్తున్నారు. శని, ఆదివారాల్లో కోల్‌కతా, బెంగళూరు సహా దేశంలోని పలు ప్రాంతాల నుంచి ప్రయాణికులు కశ్మీర్‌ చేరుకున్నారు.

 ‘‘కశ్మీర్‌ ఇప్పుడు సురక్షితంగా ఉంది, షాపులు, సందర్శన స్థలాలు అన్నీ తెరిచే ఉన్నాయి’’ అని వారు స్వయంగా చెబుతున్నారు. ‘‘లోయ మళ్లీ పర్యటాకులతో కళకళలాడుతోంది. కశ్మీర్‌ పర్యటనకు రండి’ అని స్థానిక టూర్‌ ఆపరేటర్లతో పాటు ప్రభుత్వం కూడా పిలుపునిస్తోంది. ప్రఖ్యాత దాల్‌ సరస్సు ఆదివారం ఉదయం మళ్లీ సందడిగా మారింది. పర్యాటకులు షికారాల్లో విహరాన్ని, స్థానిక ఆతిథ్యాన్ని తనివితీరా ఆస్వాదిస్తున్నారు. కశ్మీరీల ఆతిథ్యం గొప్పగా ఉందంటూ కొనియాడుతున్నారు. ఉగ్ర దాడితో పర్యాటకం దెబ్బతినకుండా చూసుకుందామంటూ పిలుపునిస్తున్నారు.

‘ఛలో కశ్మీర్‌’ నటుడు అతుల్‌ కులకర్ణి 
కశ్మీర్‌లో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు బాలీవుడ్‌ నటుడు అతుల్‌ కులకర్ణి ముందుకొచ్చారు. ‘చలో కశ్మీర్‌’ అంటూ ఆయన ఆదివారం ఉదయం పహల్గాం చేరుకున్నారు. పెద్ద సంఖ్యలో పర్యాటకులు కశ్మీర్‌ను సందర్శించాలని విజ్ఞప్తి చేశారు. ‘‘కశ్మీర్‌ పర్యటన ప్రణాళికలను రద్దు చేసుకుంటే ఉగ్రవాదులు అనుకున్నది నెరవేరుతుంది. అది జరగకూడదు. పర్యాటకులు కశ్మీర్‌కు రావాలి’’ అని ఎక్స్‌లో పిలుపునిచ్చారు. ‘చలో కశ్మీర్‌’, ‘టెర్రరిజాన్ని ఓడించండి’, ‘ఫీట్స్‌ ఇన్‌ కశ్మీర్‌’ అంటూ హ్యాష్‌టాగ్‌లు జోడించారు. ఉగ్రవాదాన్ని ఓడించాలనే సందేశంతో కశ్మీర్లో రెండు రోజుల పాటు పర్యటిస్తానని కులకర్ణి చెప్పారు. 

ఇలాంటి కార్యకలాపాలు స్థానిక ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వడమే కాకుండా దేశవ్యాప్తంగా ప్రజలు పరస్పరం అర్థం చేసుకోవడానికి దోహదపడతాయని పేర్కొన్నారు. కశ్మీరీ జీవన విధానాన్ని అర్థం చేసుకోవడానికి ఆసక్తిగా ఉన్న తమిళనాడుకు చెందిన పర్యాటకుల బృందాన్ని పహల్గాంలో చూశానని, ఇలాంటి సంభాషణలు ప్రజల సన్నిహిత బంధాలను పెంపొందించడానికి, ఐక్యత, కరుణ సందేశాన్ని పంపడానికి కూడా సహాయపడతాయని ఆయన అన్నారు. పహల్గాంలోని బైసారన్‌ లోయలో మంగళవారం ఉగ్ర దాడి జరిగిన వెంటనే కశ్మీర్‌లోని హోటళ్లు, హౌస్‌ బోట్ల టూరిస్ట్‌ బుకింగ్స్‌లో 80 శాతం వరకు రద్దవడం తెలిసిందే. వేలాది మంది పర్యాటకులు కశ్మీర్‌లో పర్యటనను అర్ధాంతరంగా రద్దు చేసుకుని ప్రత్యేక విమానాలు, రైళ్లలో స్వస్థలాలకు చేరుకున్నారు.

ఉగ్ర లక్ష్యం నెరవేర నీయొద్దు
‘‘దుర్గా పూజ తర్వాత కశ్మీర్‌ పర్యటనకు బుకింగ్స్‌ చేసుకున్నాం. దాడితో షాకయ్యాం. కానీ స్థానికులతో మాట్లాడాక వెళ్లొచ్చని నిర్ధారించుకున్నాం. ఈ ఉద్రిక్త పరిస్థితుల్లో కశ్మీర్‌ను కచ్చితంగా పర్యటించాలనే వచ్చాం. భయపడి ఆగిపోతే ఉగ్రవాదుల లక్ష్యాన్ని నెరవేర్చిన వాళ్లమవుతాం అనిపించింది. అందుకే వచ్చాం’ అని కోల్‌కతా నుంచి వచ్చిన ఓ యువతి తెలిపారు. ‘‘ఇప్పుడు కశ్మీర్‌ సురక్షితంగా ఉంది. గుల్మార్గ్, సోన్‌మార్గ్, తరువాత పహల్గాం కూడా వెళ్లాలనుకుంటున్నాం. కశ్మీర్‌ భారత్‌లో భాగం. మనం కశ్మీర్‌ సందర్శించడం స్థానికులకు సాయం చేసినట్టవుతుంది. ఈ విషాద సమయాల్లో మనమంతా ఒక్కటని చాటాల్సిన అవసరముంది’’ అని మరో యువకుడు నొక్కి చెప్పారు. ‘‘మేం దాడి తర్వాతే వచ్చాం. ఇప్పుడిక్కడ అంతా సాధారణంగానే ఉంది. చల్లటి వాతావరణాన్ని ఎంజాయ్‌ చేశాం’ అని బెంగళూరుకు చెందిన దంపతులు చెప్పారు. 

– సాక్షి, నేషనల్‌ డెస్క్‌  
 

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)