Breaking News

లఢక్ పర్యటకుని నిర్లక్ష‍్యం.. సోయగాల ఒడిలో కమ్ముకున్న దుమ్ము మేఘాలు..

Published on Mon, 07/10/2023 - 10:41

లఢక్‌: భూతల స్వర్గం కశ్మీర్‌.. అక్కడి లఢక్ పీఠభూమి అందాలు ఎంత చూసిన తనివితీరనివి. అలాంటి ప్రాంతాలను పర్యాటకుల నిర్లక్ష‍్యం కారణంగా మురికిగా మారుతున్నాయి. లఢక్‌ను  పరిరక్షించుకోవాలని భావించి ఈ ప్రాంతాన్ని రామ్‌సర్ సైట్‌లో కూడా చేర్చారు. అయినప్పటికీ ఇటీవల ఓ యాత్రికుడు చేసిన పని చూస్తే చివాట్లు పెట్టకుండా ఉండలేరు. దీనికి సంబంధించిన దృశ్యాలను అటవీ అధికారి ట్విట్టర్ వేదికగా పంచుకున్నారు. 

రామ్‌సైట్‌ అయినటువంటి త్సో కర్, త్సో మోరిరి సరస్సుల ప్రాంగణం ప్రశాంతతకు పెట్టింది పేరు. వలస పక్షుల కిలకిలరావాలతో అలరారుతుంది. అలాంటి ప్రాంతంలో ఓ యాత్రికుడు ఎస్‌యూవీతో భీబత్సం సృష్టించాడు. వేగంగా చక్కర్లు కొడుతూ ఆ ప్రాంతాన్ని దుమ్ము మయం చేశాడు. ఎస్‌యూవీ టైర్ల నుంచి లేచే దమ్ము దృశ్యాలు అక్కడి మేఘాలను తలపిస్తున్నాయి. ఈ వీడియోను మోఫుసిల్_మెడిక్ అనే ట్విట్టర్ యూజర్ తన ఖాతాలో పంచుకున్నాడు. అది కాస్తా తెగ వైరల్ అయింది. 

ఈ వీడియోపై నెటిజన్లు ఫైరయ్యారు. పర్యటకుని నిర్లక్ష‍్యానికి తగిన బుద్ది చెప్పాలను సూచించారు. మూర్ఖత్వం తారాస్థాయికి చేరింది.. ఇలాంటి పర్యటకులను ఆ ప్రాంతంలోకి అనుమతించకూడదని మరో యూజర్ అన్నాడు. భూటాన్ లాగే లఢక్‌లో పర్యటకులకు భారీ ట్యాక్స్‌లను విధించాలని, ఇలాంటి ఘటనలపై భారీ జరిమానాలు వసూలు చేయాలని మరో వ్యక్తి కామెంట్ బాక్స్‌లో రాసుకొచ్చాడు. 

ఇదీ చదవండి: శరవేగంగా రామాలయ నిర్మాణ పనులు.. 2024 జనవరి నుంచి రామ్‌లాలా దర్శనభాగ్యం!

Videos

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)