Breaking News

Year Ender 2024: కొత్తగా ప్రారంభించిన పథకాలు.. ప్రయోజనాలు ఇవే..

Published on Sat, 12/28/2024 - 07:45

మనమంతా కొద్దిరోజుల్లో 2025లోకి ప్రవేశించబోతున్నాం. ఈ ముగియబోతున్న 2024 కొన్ని రంగాల్లో భారత్‌కు దిశానిర్దేశం చేసింది. ఈ సంవత్సరం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పలు కొత్త పథకాలను అమలుచేశాయి. ఇవి అభివృద్ధి చెందుతున్న భారతదేశ కలలను కలలను సాకారం చేసేందుకు దోహదపడనున్నాయి.

ఈ సంవత్సరం భారత ప్రభుత్వం దేశంలోని యువతను విద్యా రంగంలో ముందుకు తీసుకెళ్లడానికి పీఎం విద్యాలక్ష్మి లాంటి పథకాలను ప్రవేశపెట్టింది. 2024లో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ పథకాలతో దేశంలోని  అన్నివర్గాలకు ప్రయోజనం చేకూరనుంది. ఈ క్రమంలో 2024లో కేంద్ర ‍ప్రబుత్వం ఏయే పథకాలను ప్రారంభించిందో తెలుసుకుందాం.

పీఎం విద్యా లక్ష్మీ యోజన
ప్రధాన మంత్రి విద్యా లక్ష్మి యోజన కింద ఉన్నత విద్యా సంస్థల్లో ప్రవేశం పొందే విద్యార్థులు ఫీజులు, ఇతర ఖర్చులకు హామీ లేకుండా బ్యాంకులు, ఆర్థిక సంస్థల నుండి రుణాలు పొందుతారు. నవంబర్ 6న ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో ఈ పథకానికి ఆమోదముద్ర వేశారు.

ఈ పథకం కింద విద్యార్థులు ఎటువంటి హామీ లేకుండా రూ.10 లక్షల వరకు రుణం తీసుకోవచ్చు. అదే సమయంలో రూ. 7.5 లక్షల వరకు రుణాలపై, విద్యార్థులు ప్రభుత్వం నుండి 75 శాతం వరకు క్రెడిట్ గ్యారెంటీని పొందుతారు. ఈ పథకం కింద కుటుంబ ఆదాయం సంవత్సరానికి రూ. 4.5 లక్షలు ఉన్న విద్యార్థులకు వడ్డీపై పూర్తి సబ్సిడీ లభిస్తుంది. ఇదేకాకుండా వార్షిక ఆదాయం రూ. 8 లక్షలున్న కుటుంబాలకు చెందిన విద్యార్థులకు రూ. 10 లక్షల వరకు రుణాలపై మూడు శాతం వడ్డీ రాయితీని ఇస్తారు.

బీమా సఖీ పథకం
ఈ పథకం లక్ష్యం ఆర్థికంగా మహిళలను బలోపేతం చేయడం. పదో తరగతి ఉత్తీర్ణులైన 18 నుండి 70 ఏళ్ల మధ్య వయస్సు కలిగిన మహిళలు లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అంటే ఎల్‌ఐసీ అందించే బీమా సఖీ పథకం  నుంచి ప్రయోజనాన్ని పొందవచ్చు. ఈ పథకం కింద మహిళలను బీమా ఏజెంట్లుగా తీర్చిదిద్దనున్నారు. అలాగే మూడేళ్ల పాటు మహిళలకు ప్రత్యేక శిక్షణ, గౌరవ వేతనం అందించనున్నారు.

పీఎం సోలార్ హోమ్ స్కీమ్
ప్రధాని నరేంద్ర మోదీ 2024, ఫిబ్రవరి 15న ఈ పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం కింద దేశంలోని ప్రజలు తమ ఇళ్ల పైకప్పులపై సోలార్ ప్యానెల్స్‌ను ఏర్పాటు చేసుకునేందుకు సబ్సిడీని అందిస్తారు.

సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ 
దేశంలో 70 ఏళ్లు పైబడిన సీనియర్ సిటిజన్లకు ఆయుష్మాన్ భారత్ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఈ ఏడాది ఈ పథకాన్ని మరింతకాలం పెంచారు. ఈ ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో 70 ఏళ్లు పైబడిన వృద్ధులందరికీ రూ.5 లక్షల ఆరోగ్య బీమా కవరేజీ అందించనున్నారు. 

ఇది కూడా చదవండి: 20 Years of Tsunami: రాకాసి అలలను దాటి.. విషసర్పాల కారడవిలో శిశువుకు జన్మనిచ్చి..

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)