Breaking News

దళిత విద్యార్థి వేళ్లు నరికేశారు

Published on Wed, 03/12/2025 - 07:09

తిరునల్వేలి: తమిళనాడులోని తిరునల్వేలి జిల్లాలో ఘోరం జరిగింది. పరీక్ష రాయడానికి వెళ్తున్న దేవేంద్రన్‌ అనే 11వ తరగతి విద్యారి్థపై కొందరు కిరాతకులు దాడి చేసి చేతి వేళ్లు దారుణంగా నరికేశారు. దిన కూలీ అయిన కొడుకైన దేవేంద్రన్‌ సోమవారం పాళయంకోటలోని పరీక్షా కేంద్రానికి బస్సులో బయలుదేరాడు. మార్గమధ్యంలో క్రాసింగ్‌ వద్ద ముగ్గురు వ్యక్తులు బస్సును అడ్డగించారు. దేవేంద్రన్‌ను బయటికి లాగి ఎడమ చేతి వేళ్లు నరికేశారు.

అడ్డొచ్చిన అతని తండ్రి గణేశ్‌పైనా దాడి చేశారు. అతనికి తల, ఇతర చోట్ల తీవ్ర గాయాలయ్యాయి. ప్రయాణికులు అడ్డుకోవడంతో అగంతకులు పారిపోయారు. తండ్రీకొడుకులను అదే బస్సులో శ్రీవైకుంఠం ప్రభుత్వాస్పత్రికి, తరువాత తిరునల్వేలి ఆస్పత్రికి తరలించారు. దాడికి తెగబడ్డ ముగ్గురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కబడ్డీ మ్యాచ్‌లో ఓటమికి ప్రతీకారంగానే దాడికి తెగబడ్డారని దేవేంద్రన్‌ కుటుంబం ఆరోపించింది.   

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)