Breaking News

కల్యాణ్‌ బెనర్జీ రాజీనామా ఆమోదం

Published on Wed, 08/06/2025 - 06:27

కోల్‌కతా: తృణమూల్‌ కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు, అసమ్మతి గళాలను ఆ పార్టీ చీఫ్, పశ్చిమబెంగాల్‌ సీఎం మమతా బెనర్జీ తీవ్రంగా పరిగణిస్తున్నారు. సోమవారం లోక్‌సభలో పార్టీ చీఫ్‌ విప్‌ పదవికి సీనియర్‌ నేత కల్యాణ్‌ బెనర్జీ సమరి్పంచిన రాజీనామాను ఆమె ఆమోదించారు. ఆవెంటనే, కల్యాణ్‌ బెనర్జీ స్థానంలో కకోలీ ఘోష్‌కు చీఫ్‌ విప్‌ బాధ్యతలు అప్పగించారు. లోక్‌సభలో పార్టీ ఉపనేతగా శతాబ్ది రాయ్‌ను నియమించారు. కేవలం 24 గంటల వ్యవధిలోనే ఇవన్నీ చకచకా జరిగిపోయాయి. అసమ్మతిని, తిరుగుబాటు వైఖరిని సహించే ప్రసక్తేలేదని దీనిద్వారా ఆమె చెప్పకనే చెప్పినట్లయింది.

‘పార్టీ కంటే తామే మిన్న అని భావించే వారికి ఇదో హెచ్చరిక. వారికి ఇటువంటి గట్టి సందేశం ఇవ్వాల్సిన అవసరం ఉంది’అని టీఎంసీ సీనియర్‌ నేత ఒకరు పేర్కొన్నారు. మమతా బెనర్జీ మేనల్లుడు, టీఎంసీ ప్రధాన కార్యదర్శి అభిõÙక్‌ బెనర్జీకి లోక్‌సభలో పార్టీ నేతగా సోమవారం బాధ్యతలు అప్పగించడం తెల్సిందే. 

పార్లమెంట్‌ సమావేశాలకు సరిగ్గా రాని ఎంపీలను వదిలేసి, తనది సమన్వయ లోపమని టీఎంసీ చీఫ్‌ మమత తప్పుబడుతున్నారంటూ కల్యాణ్‌ బెనర్జీ సోమవారం బహిరంగంగా వ్యాఖ్యానించడం తెల్సిందే. కొంతకాలంగా కల్యాaణ్‌ బెనర్జీ, పార్టీకే చెందిన మరో ఎంపీ మహువా మొయిత్రాలు మధ్య సోషల్‌ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసుకుంటున్న నేపథ్యంలోనే ఈ పరిణామాలు సంభవించడం గమనార్హం. 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)