Breaking News

తగ్గిన పులుల మరణాలు

Published on Fri, 12/27/2024 - 05:49

సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది పులుల మరణాలు గణనీయంగా తగ్గాయని నేషనల్‌ టైగర్‌ కన్జర్వేషన్‌ అథారిటీ (ఎన్‌టీసీఏ) వెల్లడించింది. పులుల సంరక్షణ చర్యలు పటిష్టం చేయడం, వణ్యప్రాణి చట్టాల కఠిన అమలు, అభయారణ్యాలలో వేటగాళ్ల కట్టడి చర్యల ఫలితంగా మరణాల సంఖ్య తగ్గుముఖం పట్టిందని పేర్కొంది. గత ఏడాదిలో మొత్తం మరణాల సంఖ్య 182గా ఉండగా, ఈ ఏడాది కేవలం 122 మరణాలే సంభవించినట్లు తెలిపింది.

 ఈ ఏడాది సంభవించిన మరణాల్లో అధికంగా మధ్యప్రదేశ్‌లో 44, తర్వాతి స్థానంలో మహారాష్ట్రలో 21 పులుల మరణాలు సంభవించాయి. తెలంగాణలో ఈ ఏడాది జనవరిలో కవ్వాల్‌ రిజర్వ్‌ ప్రాంతంలో రెండు పులులు మృతి చెందినట్లు నివేదిక పేర్కొంది. దేశ వ్యాప్తంగా 2012 నుంచి 2024 డిసెంబర్‌ 25 వరకు దేశ వ్యాప్తంగా మొత్తంగా 1,366 పులులు మరణించినట్లు గణాంకాలు చెబుతున్నాయి. ఇందులో 2020లో 106, 2021లో 127, 2022లో 122, 2023లో 182 పులులు మరణించాయి.

 అత్యధికంగా మధ్యప్రదేశ్‌లో 355, మహారాష్ట్రంలో 261, కర్ణాటకలో 179 పులులు మరణించగా, ఆంధ్రప్రదేశ్‌లో 14, తెలంగాణలో 11 మరణాలు సంభవించాయి. వణ్యప్రాణి సంరక్షణ ప్రాంతాల పరిధిలో జరిగిన మరణాలు 50శాతం వరకు ఉండగా, వెలుపల జరిగిన మరణాలు 42 శాతంగా ఉండగా, మరో 8 శాతం వేటగాళ్ల నుంచి స్వా«దీనం చేసుకున్న సందర్భాలున్నాయి. ఆహారం, నీటి కోసం తమ భూభాగాలను విడిచిపెట్టి బయటికి రావడం, ఆహారం కోసం పులుల మధ్య ఘర్షణలు జరగడం, ఇతర జంతువులతోనే వేటకై పోటీ ఉండటంతో మరణాలు జరుగుతునట్లు నివేదిక తెలిపింది. అయితే గత ఏడాది ప్రాజెక్ట్‌ టైగర్‌లో బాగంగా గ్రీన్‌ కవర్‌ పెంచడం, బఫర్‌ జోన్‌లలో నిర్మాణాల కట్టడి, అటవీ భూముల బదలాయింపుల నిలుపుదల, వేటగాళ్లపై నిరంతర నిఘా, రాత్రి వేళల్లో సఫారీల నిలుపుదల, టైగర్‌ రిజర్వ్‌లో నిర్మాణ కార్యకలాపాల కట్టడి వంటి చర్యలతో పులుల మరణాలు తగ్గాయని అంచనా వేసింది. 

Videos

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

Photos

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)