గోడ మీద పులి 

Published on Fri, 01/09/2026 - 06:32

అనగనగా రాజస్థాన్‌లోని రణథంబోర్‌ నేషనల్‌ పార్క్‌.. అక్కడో అందమైన కోట. అక్కడికి పర్యాటకులు వస్తున్నప్పుడు.. కళ్లెదుట ఓ అద్భుతం జరిగింది. రాజసం ఉట్టిపడే చారిత్రక రణథంబోర్‌ కోట పార్కింగ్‌ ఏరియాలోకి ఒక బుల్లి పులి పిల్ల దర్జాగా నడుచుకుంటూ వచి్చంది. 

అమ్మ లేనప్పుడు.. 
ఈ క్యూట్‌ కిల్లర్‌ రణథంబోర్‌ అడవిలో ప్రఖ్యాత పులి ’రిద్ధి’ సంతానం. అమ్మ పక్కన లేని సమయం చూసి, మన బుజ్జిది బయటకు షికారు చేసింది. మెత్తని పాదాలతో, చారల చొక్కా వేసుకుని, అచ్చం పిల్లిలా మెల్లగా కోట పార్కింగ్‌లోకి అడుగుపెట్టింది. 

దర్జా చూడు.. 
సఫారీ జీపుల్లోని పిల్లలు, పెద్దలు ఆశ్చర్యంగా వీడియోలు తీస్తుంటే.. ఈ బుజ్జి పులి మాత్రం ‘నేను మీకంటే అందంగా ఉన్నాను కదా!’అన్నట్టుగా రాజసంగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. ఒక సఫారీ జీపు ఏకంగా ఈ బుజ్జి కూనకు భయపడి వెనక్కి వెళ్లిందంటే నమ్ముతారా? 

ఏ బిడ్డా.. ఇది నా అడ్డా.. 
కోట గోడల మీద నడుస్తూ, పాత కట్టడాల మధ్య దాగుడుమూతలు ఆడుతూ.. ‘ఇది నా ఇలాకా’.. అని నిరూపించింది ఈ చిన్నారి పులి. చరిత్ర అంటే పుస్తకాల్లోనే కాదు, ఇలా పులి పిల్లల నడకల్లో కూడా ఉంటుందని రణథంబోర్‌ మరోసారి నిరూపించింది. ‘ఇలాంటి క్షణాలే రణథంబోర్‌ను ప్రత్యేకం చేస్తాయి’అని రణతంబోర్‌ నేషనల్‌ పార్క్‌ ఇన్‌స్ట్రాగామ్‌ ఖాతాలో పేర్కొంది.  
    
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)