ఛత్తీస్‌గఢ్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతి

Published on Sun, 04/07/2024 - 04:30

చర్ల: ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రం బిజాపూర్‌ జిల్లాలో శనివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల్లో ముగ్గురు మావోయిస్టులు మృతి చెందారు. ఊసూరు పోలీస్‌ స్టేషన్‌ పరిధి పూజారి కాంకేర్‌– నంబి సమీపాన కర్రిగుట్టల్లో మావోయిస్టులు సంచరిస్తున్నారనే నిఘా వర్గాల సమాచారంతో ఛత్తీస్‌గఢ్, తెలంగాణ రాష్ట్రాల సీఆర్‌పీఎఫ్, డీఆర్‌జీ, గ్రేహౌండ్స్‌ పోలీసు బలగాలు కూంబింగ్‌ చేపట్టాయి. ఈ సందర్భంగా శనివారం తెల్లవారుజామున కర్రిగుట్ట అడవుల్లో బలగాలకు మావోయిస్టులు తారసపడ్డారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల నడుమ గంటసేపు ఎదురుకాల్పులు కొనసాగాయి.

అనంతరం ఆ ప్రాంతంలో గాలించగా ముగ్గురు మావోయిస్టుల మృతదేహాలు లభ్యమయ్యాయి. ఒక ఏకే–47, ఒక మెషీన్‌గన్, ఒక 12 బోర్‌ తుపాకీతో పాటు పెద్ద మొత్తంలో మందుగుండు సామగ్రి, ఔషధా లు, నిత్యావసర వస్తువులను స్వా«దీనం చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా కాటారం మండలం అంకు‹Ùపూర్‌ గ్రామానికి చెందిన అన్నె సంతోష్‌ అలియాస్‌ శ్రీధర్‌ అలియాస్‌ సాగర్‌గా గుర్తించారు. మావోయిస్టు పార్టీ రాష్ట్ర కమిటీ సభ్యుడైన(ఎస్‌సీఎం) సాగర్‌.. సెంట్రల్‌ రీజియన్‌ కమాండ్‌(సీఈసీ)కు డిప్యూటీగా వ్యవహరిస్తున్నాడు. ఇతనిపై రూ.25 లక్షల రివార్డు ఉందని పోలీసులు తెలిపారు. మిగతా ఇద్దరినీ గుర్తించాల్సి ఉంది.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)