Breaking News

మోదీ ఇలాకాలో నూపుర్‌ శర్మ పోస్టు కలకలం.. బెదిరింపు కాల్స్‌

Published on Sat, 07/16/2022 - 09:06

మహ్మాద్‌ ప్రవక్తపై బీజేపీ బహిష్కృత నేత నూపర్‌ శర్మ వ్యాఖ్యలు పెను దుమారం రేపిన విషయం తెలిసిందే. ఆమె వ్యాఖ్యలకు నిరసనగా దేశవ్యాప్తంగా నిరసనల కారణంగా హింసాత్మక ఘటనలు సైతం చోటుచేసుకున్నాయి. 

కాగా, తాజాగా నూపుర్‌ శర్మ విషయంలో మరో షాకింగ్‌ ఘటన చోటుచేసుకుంది. గుజరాత్‌లోని సూరత్‌కు చెందిన ఓ వ్యాపారవేత్త తన ఇన్‌స్టాగ్రామ్‌లో నూపుర్‌ శర్మ ఫొటోను పోస్టు చేశాడు. ఈ క్రమంలో సదరు వ్యాపారికి ఏడుగురు వ్యక్తులు కాల్‌ చేసి చంపేస్తామని బెదిరించారు. సూరత్‌లో ఉండాలనుకుంటున్నావా లేదా.. చంపేస్తామంటూ హెచ్చరించారు. ఈ క్రమంలో బాధితుడు పోలీసులకు ఆశ్రయించాడు. 

బాధితుడి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. మరో నలుగురి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నట్టు ఉమ్రా పోలీస్ స్టేషన్ ఇన్‌స్పెక్టర్ జేఆర్ చౌదరి తెలిపారు. ఇక, అదుపులోకి తీసుకున్న వారిలో మహ్మద్ అయాన్ అటాష్‌బాజివాలా, రషీద్ భురా, అలియా మహ్మద్ అనే మహిళ ఉన్నారు. ఇక, వీరంతా సూరత్ నివాసితులుగా గుర్తించినట్టు పోలీసులు వెల్లడించారు. వీరిపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పేర్కొన్నారు.  అనంతరం.. సదరు వ్యాపారవేత్త వెంటనే సోషల్‌ మీడియా ఖాతా నుంచి నూపుర్‌ శర్మ ఫొటోను తొలగించి, క్షమాపణలు చెప్పాడు.

ఇది కూడా చదవండి: తమిళనాట రాజకీయ చదరంగం: పన్నీరు సెల్వానికి షాకిచ్చిన పళనిస్వామి

Videos

ఎమ్మెల్యే కాల్వ శ్రీనివాసులు బండారం బయటపడుతుందనే ఉరవకొండకి రాలేదు

జనసేనపై పిఠాపురం టీడీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు..

ఏందిరయ్యా ఏంజేతున్నావ్

హైదరాబాద్ లో పలుచోట్ల వర్షం

పాక్ లో నన్ను పెళ్లి చేసుకో.. టెర్రరిస్టులతో జ్యోతి లవ్ స్టోరీ

గరం ఛాయ్ సెలబ్రేషన్స్

మాపై కక్ష ఉంటే తీర్చుకోండి.. కానీ 18వేల మంది కుటుంబాలను రోడ్డున పడేయకండి..

ఢిల్లీ ఢమాల్.. ప్లే ఆఫ్ కు ముంబై

Big Question: అరెస్టులు తప్ప ఆధారాలు లేవు.. మద్యం కేసు మటాష్

కూటమి ప్రభుత్వ అరాచకాలను, దాష్టికాలను దీటుగా ఎదుర్కొందాం: YS జగన్

Photos

+5

ప్రసాద్ ఐమ్యాక్స్‌ : ‘రానా నాయుడు సీజన్-2’ టీజర్‌ ఈవెంట్‌ రానా సందడి (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం..భారీగా ట్రాఫిక్ జామ్ (ఫొటోలు)

+5

హనుమాన్‌‌ జయంతి .. జనసంద్రంగా కొండగట్టు అంజన్న క్షేత్రం (ఫొటోలు)

+5

విజయ్‌ సేతుపతి 'ఏస్‌' మూవీ ప్రీరిలీజ్‌ వేడుక (ఫొటోలు)

+5

'హరి హర వీరమల్లు' సాంగ్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

కేన్స్‌లో అదితి ఆరుగజాల చీర, సింధూరంతో ముగ్ధమనోహరంగా మురిపించింది (ఫొటోలు)

+5

కుమారుడి టాలెంట్‌ చూసి మురిసిపోతున్నడైరెక్టర్‌ సుకుమార్ భార్య (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ ఫిలిం ఫెస్టివల్‌లో అనామిక ఖన్నా బ్యాక్‌లెస్ గౌనులో జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

తిరుమల శ్రీవారిని దర్శించుకున్న టాలీవుడ్ ప్రముఖులు (ఫొటోలు)

+5

‘షష్టిపూర్తి’ మూవీ హీరోయిన్‌ ఆకాంక్ష సింగ్ (ఫొటోలు)