Breaking News

ఫేస్‌బుక్‌ ప్రేమ.. పెళ్లి.. కట్‌చేస్తే రెండేళ్ల తర్వాత..

Published on Wed, 09/07/2022 - 07:32

తిరువళ్లూరు (చెన్నై): ఫేస్‌బుక్‌లో పరిచయమైన దాదాపు రెండేళ్ల ప్రేమ వ్యవహరాన్ని నడిపి కులాంతర వివాహం చేసుకున్న యువతిని అత్తారింటి వాళ్లు గెంటేయడంతో న్యాయం చేయాలని బాధిత యువతి ఎస్పీ పకెర్లా సెఫాస్‌ కల్యాణ్‌కు ఫిర్యాదు చేసింది. వివరాలు.. కల్లకురిచ్చి జిల్లా శంకరాపురం యూనియన్‌ విరయూర్‌ గ్రామానికి చెందిన అంథోనిరాజ్‌ కుమార్తె అన్బరసి(25). ఇంజినీరింగ్‌ పూర్తి చేసి పెరంబలూరులోని ప్రైవేటు పాఠశాలలో ఇంగ్లిష్‌ టీచర్‌గా పని చేసేది.

2018లో ఫేస్‌బుక్‌ ద్వారా తిరువళ్లూరు జిల్లా తిరువళాంగాడు యూనియన్‌ చిన్నకలకాటూరు గ్రామానికి చెందిన జయరామన్‌ కుమారుడు లక్ష్మణన్‌ పరిచయమయ్యాడు. రెండేళ్ల ప్రేమించుకున్న అనంతరం ఇరు కుటుంబాలను ఒప్పించి మార్చి13, 2020న తిరువళాంగాడులోని ప్రైవేటు కల్యాణ మండపంలో వివాహం జరిపించారు. వీరికి ప్రస్తుతం రష్మిక(01) అనే కూతురు వుంది. వివాహం సమయంలో రూ.1.30 లక్షల నగదు, పది సవర్ల బంగారు నగలు కట్నంగా ఇచ్చినట్టు తెలుస్తుంది. అయితే వివాహమైన కొన్ని రోజులు సజావుగా సాగిన వీరి కుటుంబంలో కులాంతర చిచ్చు రేగింది.

వినతిపత్రం చూపుతున్న అన్బరసి

అన్బరసి దళిత కులానికి చెందిన యువతి కావడంతో ఆమెకు ప్రత్యేక గ్లాస్, ప్లేటును ఇచ్చి ప్రత్యేక గదిలో ఉంచి వేధింపులకు గురి చేశారు. తరచూ కులం పేరుతూ దూషిస్తుండడంతో ఆరు నెలల క్రితం బాధితురాలు తిరుత్తణి మహిళ పోలీసు స్టేషన్‌ను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికి కౌన్సెలింగ్‌ ఇచ్చి కలిసి జీవించాలని సూచించారు. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం అన్బరసిపై లక్ష్మణ్‌ కుటుంబ సభ్యులు మరో సారి దాడికి దిగారు. దీంతో బాధితురాలు మంగళవారం ఎస్పీని ఆశ్రయించి న్యాయం చేయాలని కోరింది.

తనను, కూతురిని కులం పేరుతో దూషిస్తున్నారని, తిండి పెట్టకుండా వేధిస్తున్నారని, భర్త లక్ష్మణ్, అత్త దేవకితో పాటు మరో ఐదు మందిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసింది. గతంలో తనపై దాడి చేసిన వీడియోను సైతం ఎస్పీకి అందించింది. ఈ సంఘటనపై స్పందించి తక్షణం విచారణ చేయాలని తిరుత్తణి పోలీసులను ఎస్పీ ఆదేశించారు.  

చదవండి: (వేద నిలయం విక్రయించే ప్రసక్తే లేదు.. త్వరలోనే..)

Videos

Amarnath: పరిపాలన కూడా.. ప్రైవేటీకరణ చేసే పరిస్థితి..

జిల్లాల పునర్విభజనపై శ్రీకాంత్ రెడ్డి రియాక్షన్

రిటర్నబుల్ ప్లాట్ల విషయంలో రామారావును మోసం చేసిన చంద్రబాబు ప్రభుత్వం

కళ్లు ఎక్కడ పెట్టుకున్నారు ? రెడ్ బుక్ పేరుతో బెదిరింపులు, అక్రమ కేసులు

ఆదోని మెడికల్ కాలేజీని ప్రేమ్ చంద్ షాకి అప్పగించాలని నిర్ణయం

తాడిపత్రిలో ఇంత ఫ్రాడ్ జరుగుతుంటే.. JC ప్రభాకర్ రెడ్డి పెద్దారెడ్డి కౌంటర్

అన్నమయ్య మూడు ముక్కలు ఏపీలో కొత్త జిల్లాల చిచ్చు

రాయచోటి జిల్లా కేంద్రం మార్పునకు ఆమోదం తెలిపిన మంత్రి రాంప్రసాద్

ఉన్నావ్ రేప్ కేసుపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు

Anantapur: పోలీసులతో కలిసి రైతుల భూములు లాక్కుకుంటున్న టీడీపీ నేతలు

Photos

+5

తిరుమలలో వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం.. (ఫొటోలు)

+5

అనసూయ అస్సలు తగ్గట్లే.. మరో పోస్ట్ (ఫొటోలు)

+5

థ్యాంక్యూ 2025.. భాగ్యశ్రీ క్యూట్ ఫొటోలు

+5

తిరుమల శ్రీవారి సేవలో 'ఛాంపియన్' హీరోహీరోయిన్ (ఫొటోలు)

+5

‘ది రాజా సాబ్’ప్రీ రిలీజ్ లో మెరిసిన హీరోయిన్స్‌ మాళవిక, రిద్ది కుమార్ (ఫొటోలు)

+5

సల్మాన్ ఖాన్‌ 60వ బర్త్‌డే సెలబ్రేషన్స్.. ఫోటోలు వైరల్‌

+5

దళపతి 'జన నాయగన్' ఆడియో లాంచ్ (ఫొటోలు)

+5

మేడారం : తల్లులకు తనివితీరా మొక్కులు..(ఫొటోలు)

+5

బుక్‌ఫెయిర్‌ కిటకిట..భారీగా పుస్తకాలు కొనుగోలు (ఫొటోలు)

+5

గచ్చిబౌలి స్టేడియం : కూచిపూడి కళావైభవం గిన్నీస్‌ ప్రపంచ రికార్డు (ఫొటోలు)